విద్యార్థుల్లో దేశభక్తి పెంచేలా ‘గాంధీ’ సినిమా

ABN , First Publish Date - 2022-08-12T05:01:20+05:30 IST

దేశానికి స్వాతంత్య్ర వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా

విద్యార్థుల్లో దేశభక్తి పెంచేలా ‘గాంధీ’ సినిమా
శంకర్‌పల్లిలోని ఓ థియేటర్‌లో సినిమా చూస్తున్న విద్యారులు

  • ఇప్పటివరకు సినిమా చూసిన విద్యార్థులు 1,14,000 మంది 


రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 11 : దేశానికి స్వాతంత్య్ర వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాలు’ ఘనంగా జరుగుతున్నాయి. అందులోభాగంగా 1982లో ఆస్కార్‌ అవార్డు పొందిన ‘గాంధీ’ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే దిశగా గాంధీ సినిమాను చూపిస్తున్నారు. విద్యార్థుల కోసం మహాత్మాగాంధీ జీవితచరిత్ర ఆధారంగా రూపొందించిన ‘గాంధీ’ సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. ప్రతీరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15గంటల వరకు ఉచితంగా ప్రదర్శిస్తున్న గాంధీ సినిమాకు మంచి స్పందన లభిస్తుంది. జిల్లాలో 92 స్ర్కీన్లు ఉన్నాయి. 35,081 సీటింగ్‌ కెపాసిటీ ఉండగా రోజుకు 38 వేల మంది విద్యార్థులు గాంధీ మూవీని తిలకిస్తున్నారు. ఇప్పటివరకు మూడు రోజులపాటు 1,14,000 మంది విద్యార్థులు ఉచితంగా మూవీని చూశారు. జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆదేశాల మేరకు డీఈవో సుశీందర్‌రావు ప్రతి పిల్లాడు గాంధీ సినిమా తిలకించే విధంగా చర్యలు తీసుకుం టున్నారు. 9 రోజుల పాటు ప్రదర్శించే గాంధీ మూవీని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యార్థులు చూసే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాల నుంచి బయలుదేరిన విద్యార్థులు తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్లేలా ఉపాధ్యాయులు దగ్గరుండి చూసుకునేలా సూచిస్తున్నారు. ఇప్పటికీ మూడు రోజులపాటు గాంధీ మూవీ ప్రదర్శన పూర్తి కాగా మరో ఆరు రోజులపాటు ప్రదర్శించే గాంధీ మూవీని విద్యార్థులు తప్పకుండా చూసేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. 



Updated Date - 2022-08-12T05:01:20+05:30 IST