భక్తులతో కిటకిటలాడిన గండి క్షేత్రం

ABN , First Publish Date - 2021-10-17T05:12:40+05:30 IST

గండి వీరాంజనేయస్వామి దేవస్థానం శనివారం భక్తులతో కిటకిటలాంది.

భక్తులతో కిటకిటలాడిన గండి క్షేత్రం
గండి అంజన్న దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు

చక్రాయపేట, అక్టోబరు 16: గండి వీరాంజనేయస్వామి దేవస్థానం శనివారం భక్తులతో కిటకిటలాంది. ఒకవైపు పాపాఘ్ని పరవళ్లు తొక్కుతుండడం, మరోవైపు గండి దేవ స్థానం 27వ తేదీ అనంతరం మూలవిరాట్టు దర్శనాలు ఉండకపోవడం తెలుసుకున్న భక్తులు అంజన్న దర్శనం కోసం క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఉదయం 9గంటల నుం చి మద్యాహ్నం 2గంటల వరకు స్పెషల్‌ దర్శనం, ఆకుపూజలు, సర్వదర్శనం క్యూలో భక్తులు బారులుతీరారు. పాపాఘ్ని పరవళ్లు తొక్కుతుండడంతో పోలీసుల పహారా ఉన్నా భక్తులు నదిలో స్నానాలాచరిస్తున్నారు. శనివారం సాయంత్రం భక్తులు భారీ ఎత్తున నదిలో స్నానానికి దిగారు. శ్రావణమాస మహోత్సవాలను తలపించే విధంగా శనివారం గండికి భక్తులు రావడం విశేషం.

Updated Date - 2021-10-17T05:12:40+05:30 IST