గాంధీ ఆస్పత్రివద్ద కట్టుదిట్టమైన భద్రత

ABN , First Publish Date - 2020-04-02T21:32:55+05:30 IST

గాంధీ ఆస్పత్రిలో బుధవారం రాత్రి వైద్యులపై కరోనా పాజిటీవ్ కేసుల బాధిత బంధువులు..

గాంధీ ఆస్పత్రివద్ద కట్టుదిట్టమైన భద్రత

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో బుధవారం రాత్రి వైద్యులపై కరోనా పాజిటీవ్ కేసుల బాధిత బంధువులు దాడి చేయడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గాంధీ ఆస్పత్రికి వెళ్లే మార్గాలతోపాటు ఆస్పత్రివద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. నిన్న ఒక్కరోజు 30మందికి పైగా కరోనా పాజిటీవ్ కేసులు రావడం.. ముగ్గురు చనిపోవడంతో అధికారులు మేల్కొన్నారు. గాంధీ ఆస్పత్రి చుట్టుపక్కల ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులను మాత్రమే ఆస్పత్రిలోకి అనుమతి ఇస్తున్నారు. సీపీ అంజనీ కుమార్ గాంధీ ఆస్పత్రివద్దకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు.


కాగా ఢిల్లీకి వెళ్లివచ్చిన వారిందరికీ పాజిటీవ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వారిని గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారంతా వైద్యానికి సహకరించడంలేదని సమాచారం. ఈ విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ దృష్టికి వైద్యులు తీసుకువెళ్లారు. దీంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి వద్ద ప్రశాంత వాతావరణం ఉంది.

Updated Date - 2020-04-02T21:32:55+05:30 IST