గాంధీ.. నల్లజాతివారిని హీనంగా చూశారా?

ABN , First Publish Date - 2020-11-29T10:17:50+05:30 IST

భారత స్వాతంత్య్ర సమరానికి మహాత్మాగాంధీని కార్యోన్ముఖుణ్ణి చేసినది దక్షిణాఫ్రికాలో ఆయనకు ఎదురైన అనుభవాలు, చేసిన పోరాటం. తొలినాళ్లలో ఆయన అక్కడి భారతీయులు, నల్లజాతివారిపై జరుగుతున్న అకృత్యాలను నిరసించారు...

గాంధీ.. నల్లజాతివారిని హీనంగా చూశారా?

లండన్‌, నవంబరు 28:  భారత స్వాతంత్య్ర సమరానికి మహాత్మాగాంధీని కార్యోన్ముఖుణ్ణి చేసినది దక్షిణాఫ్రికాలో ఆయనకు ఎదురైన అనుభవాలు, చేసిన పోరాటం. తొలినాళ్లలో ఆయన అక్కడి భారతీయులు, నల్లజాతివారిపై జరుగుతున్న అకృత్యాలను నిరసించారు. అయితే నిజానికి ఆయనకు నల్లజాతీయులంటే చులకన భావం ఉందని, వారిని హీనంగా చూశారని వేల్స్‌ ప్రభుత్వ నివేదిక ఒకటి వ్యాఖ్యానించింది.


దీనికి ఉదాహరణగా 1896లో చేసిన ఓ ప్రసంగంలో గాంధీజీ అన్న మాటను చెబుతోంది. శ్వేతజాతీయులు హిందువులు, ముస్లింలను అవిశ్వాసులుగా, మతద్రోహులుగా కించపరుస్తున్నారని  అన్నారని, ఇది పరోక్షంగా భారతీయులు నల్లజాతి ఆఫ్రికన్ల కంటే మెరుగైనవారిని చెప్పడమేనని ’ది స్లేవ్‌ ట్రేడ్‌ అండ్‌ బ్రిటిష్‌ అంపైర్‌’ అనే వెల్ష్‌ ప్రభుత్వ నివేదిక పేర్కొంది. 2017లో గాంధీజీ 148వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని కార్డిఫ్‌ బేలో గాంధీజీ విగ్రహాన్ని నెలకొల్పారు. ఇప్పుడు ఆ విగ్రహాన్ని తొలగించాలా వద్దా అన్న విషయమై చర్చ జరుగుతోంది. 


Updated Date - 2020-11-29T10:17:50+05:30 IST