రేపటి నుంచి పూర్తిస్థాయి కోవిడ్‌ ఆస్పత్రిగా గాంధీ

ABN , First Publish Date - 2021-04-16T21:43:25+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని

రేపటి నుంచి పూర్తిస్థాయి కోవిడ్‌ ఆస్పత్రిగా గాంధీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని గాంధీ ఆసుపత్రిని రేపటి నుంచి పూర్తిస్థాయి కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఓపీ నిలిపివేయాలని ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎలెక్టీవ్స్ కూడా ఆపేసి కేవలం కోవిడ్ కేసులకు మాత్రమే ట్రీట్మెంట్ చేయాలని ఆదేశించింది.


ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో 450 మంది కోవిడ్‌ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క రోజే 150 మంది కోవిడ్‌ బాధితులు గాంధీ ఆస్పత్రిలో చేరారు. గాంధీలోని ఐపీ బ్లాక్‌ ఇప్పటికే కోవిడ్‌ పేషెంట్లతో నిండిపోయింది. గాంధీ ఆస్పత్రిలో 10 నిమిషాలకు ఒక కరోనా పేషెంట్‌ అడ్మిట్ అవుతున్నాడు. దీంతో గాంధీ ఆస్పత్రిలో రేపటి నుంచి ఎమర్జెన్సీ సర్వీసులు నిలిపివేస్తున్నారు. 

Updated Date - 2021-04-16T21:43:25+05:30 IST