ప్రారంభమైన గాంధారిఖిల్లా జాతర

ABN , First Publish Date - 2021-02-27T03:40:26+05:30 IST

బొక్కల గుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే జాతరలో భాగంగా శుక్రవారం ఉదయం ఆది వాసి నాయక్‌పోడ్‌ సంఘం ఆధ్వర్యంలో సదర్‌ భీమన్న ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.

ప్రారంభమైన గాంధారిఖిల్లా జాతర
దేవతా మూర్తులను ఊరేగింపుగా తీసుకు వెళుతున్న నాయక్‌పోడ్‌ సంఘం నాయకులు

మందమర్రి, ఫిబ్రవరి 26: బొక్కల గుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే జాతరలో భాగంగా శుక్రవారం ఉదయం ఆది వాసి నాయక్‌పోడ్‌ సంఘం ఆధ్వర్యంలో సదర్‌ భీమన్న ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భీమన్న గజాలు తీసుకుని డప్పు చప్పు ళ్ళతో తిమ్మాపూర్‌, గద్దరాగడి, ఏసీసీ మీదుగా మంచిర్యాల గోదారి వద్ద అభి షేకాలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ఊరేగింపుగా ఖిల్లాకు చేరుకుని జాతరను ప్రారంభించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుం డా ఎస్‌ఐ రవిప్రసాద్‌ బందోబస్తు ఏర్పాటుచేశారు. సంఘం నాయకులు రాయమల్లు, అరుణ్‌కుమార్‌, పెద్ది భార్గవ్‌, రాజేష్‌, వైస్‌ ఎంపీపీ రాజ్‌ కుమార్‌, సర్పంచ్‌ బొలిశెట్టి సువర్ణ కనకయ్యలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-27T03:40:26+05:30 IST