గండికోట ముంపువాసుల కష్టాలు

ABN , First Publish Date - 2020-09-24T21:26:17+05:30 IST

గండకోట ముంపు ప్రాంతం కొండాపూర్ మండలం, తాళ్లప్రొద్దుటూరు వాసులు కష్టాలతో సహవాసం చేస్తున్నారు.

గండికోట ముంపువాసుల కష్టాలు

కడప జిల్లా: గండకోట ముంపు ప్రాంతం కొండాపూర్ మండలం, తాళ్లప్రొద్దుటూరు వాసులు కష్టాలతో సహవాసం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు గ్రామాన్ని వదలబోమని ముంపుబాధితులు అంటున్నారు. మరోవైపు గ్రామాన్ని ప్రాజెక్టు బ్యాక్ వాటర్ చుట్టుముట్టింది.


తమ సమస్యలు పరిష్కరించాలని కొండాపూర్ మండలం తాళ్లప్రొద్దుటూరులో గండికోట ముంపువాసులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు. బాధితులను గ్రామాల నుంచి పంపేందుకు గండికోట ప్రాజెక్టు నీటి సామర్ద్యాన్ని 16 టీఎంసీల నుంచి 20 టీఎంసీలకు పెంచాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ప్రాజెక్టులో నీటి సామర్థ్యం క్రమంగా పెరగడంతో ముంపు ప్రాంతాల్లోకి బ్యాక్ వాటర్ చేరుతోంది. లోతట్టు ప్రాంతాలు బీసీ, ఎస్సీ కాలనీలో ఇళ్లల్లోకి నీరు చేరింది. ఇప్పటికీ పరిహారం అందకపోయినా బతికుంటే చాలని బాధితుల్లో కొందరు గ్రామాన్ని వదిలి వెళుతున్నారు. ఎటు వెళ్లలేనివారు గ్రామంలోనే ఉండిపోయారు. విధిలేక చెట్లకింద రోజులు వెళ్లదీస్తున్నారు. వరద నీటిలో విషపురుగులు వస్తున్నాయని భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

Updated Date - 2020-09-24T21:26:17+05:30 IST