Abn logo
Sep 21 2021 @ 00:17AM

గంగమ్మ ఒడికి గణపయ్య

వినాయకుని ఊరేగింపు లో కళాకారుల ప్రదర్శన

సిద్దిపేట రూరల్‌, సెప్టెంబరు 20: సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా నవరాత్రుల్లో పూజలందుకున్న గణేశ ప్రతిమలు సోమవారం గంగమ్మ ఒడికి చేరాయి. నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు.  సిద్దిపేట పట్టణంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఇంటివద్ద ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడి ఊరేగింపు ఆకర్షణీయంగా నిలిచింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో విభిన్న కళాకారుల ప్రదర్శన మధ్య మంత్రి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనం చేశారు. పార్వతిమాత ఆలయం వద్ద పార్వతి మాత ఫ్యామిలీ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిమజ్జనానికి తరలించారు. ఇక్కడ నవరాత్రుల్లో పూజలందుకున్న లడ్డూ వేలం పాటలో స్థానిక దుండిగాళ్ల బల్‌ రాజేశం రూ.81,116కు దక్కించుకున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 938 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి.