ఘనంగా గణపతి హోమం
ABN , First Publish Date - 2021-03-03T02:49:37+05:30 IST
నస్పూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ లక్ష్మీగణపతి ఆలయంలో మంగళవారం సంకటహర చతుర్థిని పురస్క రించుకుని గణపతి హోమం, ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం వేళలో శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి కల్యాణం ఘనంగా నిర్వహించారు.
నస్పూర్, మార్చి 2 : నస్పూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ లక్ష్మీగణపతి ఆలయంలో మంగళవారం సంకటహర చతుర్థిని పురస్క రించుకుని గణపతి హోమం, ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం వేళలో శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం 108 కిలోల తేనెతో విశేష మహా మధురాభిషేకం నిర్వహించారు. పూజా కార్యక్రమాలు ఆలయ ప్రధానార్చకులు గంగారపు వంశీ కృష్ణ శర్మ, రాంమూర్తి శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ రఘుపతిరావు తెలిపారు.