భానూర్‌లో గణపతి, నవగ్రహ సమేత స్పటిక లింగశివ పరివార ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2020-02-20T07:17:03+05:30 IST

బానూర్‌లో నూతనంగా నిర్మించిన ఆలయంలో బుధవారం గణపతి నవగ్రహ సమేత స్పటిక లింగ శివ పరివార ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. సర్పంచ్‌ శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ మేఘమాల

భానూర్‌లో గణపతి, నవగ్రహ సమేత స్పటిక లింగశివ పరివార ప్రతిష్ఠ

పటాన్‌చె రు రూరల్‌, ఫిబ్రవరి 19 : బానూర్‌లో నూతనంగా నిర్మించిన ఆలయంలో బుధవారం గణపతి నవగ్రహ సమేత స్పటిక లింగ శివ పరివార ప్రతిష్ఠ మహోత్సవం  ఘనంగా జరిగింది. సర్పంచ్‌ శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ మేఘమాల శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకా్‌షరెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎంపీ ఎమ్మెల్యేలకు స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. భానూర్‌లో పెద్ద ఆలయం నిర్మించడం హర్షించదగ్గ విషయమన్నారు. స్పటిక శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయన్నారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మాజీ సర్పంచ్‌ మేఘమాలాశ్రీహరిని అభినందించారు. విగ్రహ ప్రతిష్ఠ  సందర్భంగా మాధవానంద సరస్వతి హో మం నిర్వహించే భక్తులను దీవించారు.  ఎంపీపీ సుష్మశ్రీ, జడ్పీటీసీ సుప్రజ పాశమైలారం మాజీ సర్పంచ్‌ సుధాకర్‌ గౌడ్‌, ఇస్నాపూర్‌ ఎంిపీటీసీ గడ్డం  శ్రీశైలం, కాంగ్రెస్‌ పార్టీ  నాయకులు శశికళ యాదవరెడ్డి, సఫానదేవ్‌, పటాన్‌చెరు కార్పొరేటర్‌ శంకర్‌ యాదవ్‌, టీడీపీ రాష్ట్ర నాయకులు ఎడ్ల రమేశ్‌,చ టీఆర్‌ఎస్‌ నాయకులు నగేశ్‌, యాదవ్‌, ఎస్‌ఆర్‌ఆర్‌ ఫార్చ్యూన్‌ ఇన్ర్ఫా అధినేతలు శ్రీనివాసరెడ్డి,  రమేశ్‌ పూజలు నిర్వహించారు.

  ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక 

 ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక చేపట్టామని ఎస్‌ఆర్‌ఆర్‌ ఫార్చ్యూన్‌ ఇన్ర్ఫా  మేనేజింగ్‌ డైరెక్టర్స్‌ పి. శ్రీనివాసరెడ్డి, కటారి రమేశ్‌ తెలిపారు. గణపతి నవగ్రహ సమేత స్ఫటిక లింగ శివ పరిహార ప్రతిష్ట  సందర్భంగా 20వేల  మందికి అన్నదానం చేశారు. ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించామని, గతంలో బేగంపేటలో రామాలయం, ఘనాపూర్‌లో సాయిబాబా గుడి, చిద్రుప్పలో అమ్మవారి ఆలయాల నిర్మాణంలో కీలకపాత్ర పోషించామని తెలిపారు. 

Updated Date - 2020-02-20T07:17:03+05:30 IST