Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వానికి పాలించే హక్కు లేదు

గణపవరం, డిసెంబరు 2:మహిళలను గౌరవించని వైసీపీ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదని టీడీపీ మండల అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరా జు విమర్శించారు. పిప్పరలో గౌరవసభ, ప్రజాసమస్యలపై చర్చావేదిక కార్యక్ర మం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారి కీర్తిని చాటి చెప్పిన మహనీయుడు, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు కుమార్తెను అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గౌరవ శాసనసభలో మహిళలను అగౌరవ పరి చేలా మాట్లాడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఏలూరు పార్లమెంట్‌ టీడీపీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి యాళ్ల సుబ్బారావు, మొయ్యేరు టీడీపీ అధ్యక్షుడు కానుమిల్లి చంటి, అల్లూరి బదరి నారాయణ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement