ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి

ABN , First Publish Date - 2022-05-29T02:48:41+05:30 IST

ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవా లను శనివారం కావలిలో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. నియోజకవర్గ ఇన్‌చా

ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి
పెద్దపవని రోడ్డులోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద పులిహార, మజ్జిగ పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలు

కావలి, మే28: ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవా లను శనివారం కావలిలో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో ట్రంకురోడ్డులోని ఎన్టీఆర్‌ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. అనంతరం  కేక్‌ కట్‌చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు.  పెద్దపవని రోడ్డులో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పులిహార, మజ్జిగ పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ అభిమాని,  అన్నదాత మణి ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  ఈ కార్యక్రమాల్లో  నేతలు మలిశెట్టి వెంకటేశ్వర్లు, మన్నవ రవిచంద్ర, పోతుగంటి అలేఖ్య, గుత్తికొండ కిషోర్‌బాబు, జ్యోతి బాబూరావు, కల్లయ్య, బొట్లగుంట శ్రీహరినాయుడు తదితరులు పాల్గొన్నారు.


ఉదయగిరిలో..


ఉదయగిరి రూరల్‌ : ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా శనివారం టీడీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బస్టాండ్‌ సెంటర్‌లో టీడీపీ నాయకులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ సీహెచ్‌ బయ్యన్న, నాయకులు బొజ్జా నరసింహులు, వెంకటస్వామి, కోళ్ల జాను, చేతల రమణయ్య, నరసింహారావు, జల్సాయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 


 

వలేటివారిపాళెంలో..


వలేటివారిపాలెం :  మండలంలోని బడేవారిపాలెంలో శనివారం ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.  కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని, ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు.  ఈ కార్యక్రమంలో  నాయకులు మాదాల లక్ష్మీనర సింహం, తాటికొండ సింహద్రి తదితరులు పాల్గొన్నారు.


 వరికుంటపాడులో..


వరికుంటపాడు :  ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను శనివారం మండలంలో ఘనంగా నిర్వహించారు. దక్కనూరు, జడదేవి, అలివేలుమంగాపురం, వరికుంటపాడు తదితర గ్రామాల్లో ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు. 


 అల్లూరులో...


అల్లూరు :  ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకొని అల్లూరు పాతబస్టాండు కూడలిలో శనివారం వేడుకలు నిర్వహించారు. పలువురు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి శ్రీనివాసలురెడ్డి, వేగూరు శ్రీనివాసులు, కన్నా రమణయ్య, అచ్యుతరెడ్డితోపాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. 



 కందుకూరులో..


కందుకూరు : ఎన్టీఆర్‌ జయంతి వేడుకలను కందుకూరులో శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్‌ విగ్రహం సెంటర్‌లో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించగా, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, ఇంటూరి నాగేశ్వరరావులు కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు. అంతకుముందు చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని మహానాడుకు తరలివెళ్తూ కందుకూరులో కొద్దిసేపు ఆగగా, ఆయనను ఇంటూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు.  అలాగే మండలంలోని పందలపాడులో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు కూనం సుబ్బారెడ్డి అధ్యక్షతన ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించటంతోపాటు కేక్‌ కట్‌చేసి పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో గోచిపాతల మోషే, చేవూరు ఏసు, వర్ల అబ్రహం, గోచిపాతల రవిరాజు, కన్నెదారి తేజ తదితరులు పాల్గొన్నారు.


వింజమూరులో...


వింజమూరు : స్థానిక పాత బస్టాండ్‌ సెంటర్‌లో టీడీపీ మండల కన్వీనర్‌ గూడా నరసారెడ్డి ఆధ్వర్యంలో  శనివారం ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. ఎన్టీఆర్‌ చేసిన సేవలను పలువురు వక్తలు వివరించారు. కాగా మహానాడుకు మండలం నుంచి 20 వాహనాల్లో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులునాయుడు, జీ రఘునాఽఽథ్‌రెడ్డి, ఖాజావలి, చల్లా శ్రీను, ఏ.శ్రీను, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 












Updated Date - 2022-05-29T02:48:41+05:30 IST