పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్ తదితరులు
(ఆంధ్రజ్యోతి బృందం)
జిల్లా వ్యాప్తంగా గణతంత్ర సంబరాలు అంబరాన్నంటా యి. ప్రతిఒక్కరిలో దేశభక్తి వెల్లివిరిసింది. మంగళవారం వాడవాడలా రిపబ్లిక్ డేని ఘనంగా నిర్వహించారు. అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాలు, సర్కారీ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యంగా విజయనగరంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, శకటాల ప్రదర్శన అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములయ్యారు.