Abn logo
Oct 2 2020 @ 03:36AM

అభివృద్ధికి ఆదర్శంగా గుమ్మిలేరు

Kaakateeya

ఏడాది కాలంలో పలు అభివృద్ధి పనులు 


ఆలమూరు, అక్టోబరు 1: గ్రామస్వరాజ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని బాపూజీ కలలు కన్న గ్రామస్వారాజ్యంగా ఆలమూరు మండలం గుమ్మిలేరు నిలుస్తుందని చెప్పవచ్చు. ఈగ్రామంలో గత ఏడాది కాలంలో జరుగుతున్న అభివృద్ధి పనులే నిదర్శనం. గుమ్మిలేరు పేరు వినగానే మేలుజాతి పశువుల పోషణకు రాష్ట్రంలో మంచి పేరు ఉంది.నేడు అభివృద్ధిలోనే ముందున్నామని నిరూపిస్తున్నారు. గ్రామాభివృద్ధిలో ప్రధానభూమిక పోషిస్తున్న పీఏసీఎస్‌ అధ్యక్షుడు, వైసిపీ నేత గుణ్ణం రాంబాబు మాటలలో.. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అందించిన ప్రోత్సాహంతో గ్రామంలో ఏడాది కాలంలో రూ.70లక్షలతో సీసీరోడ్లు, డ్రైన్లు, గ్రావెల్‌ రోడ్లు, రైతులు పంట భూములలోకి వెళ్లే మార్గాలను అభివృద్ధి చేయడంతోపాటు పలు కార్యక్రమాలు నిర్వహించామన్నారు.


ప్రస్తుతం నిర్మాణ దశలో పంచాయతీ భవనం రూ.45లక్షలు, రైతు భరోసా కేంద్రం రూ.30లక్షలు, పీహెచ్‌సీ సబ్‌సెంటర్‌ రూ.15లక్షలు, అంగన్‌వాడీ భవనం రూ.20లక్షలు, నాడు-నేడుతో పాఠశాల భవనం అభివృద్ధికి రూ.11లక్షల నిధులు మంజూరు చేశారు. తమ గ్రామాభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తున్న ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సేవలు మరువలేనివని గుణ్ణం రాంబాబు అన్నారు. 

Advertisement
Advertisement
Advertisement