కష్టం గంగూలీది.. టైటిళ్లు ధోనీవి!

ABN , First Publish Date - 2020-07-12T09:05:06+05:30 IST

ధోనీ లక్కీ కెప్టెన్‌.. ఎందుకంటే గొప్ప ఆటగాళ్లున్న జట్టు అతనికి వారసత్వంగా లభించిందని టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్‌ గౌతమ్‌ గంభీర్‌ ...

కష్టం గంగూలీది.. టైటిళ్లు ధోనీవి!

గంభీర్‌ 

న్యూఢిల్లీ: ధోనీ లక్కీ కెప్టెన్‌.. ఎందుకంటే గొప్ప ఆటగాళ్లున్న జట్టు అతనికి వారసత్వంగా లభించిందని టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. ‘ప్రతి ఫార్మాట్‌లోనూ ధోనీకి అద్భుతమైన జట్టు దొరకడం అదృష్టం. సచిన్‌, సెహ్వాగ్‌, యువరాజ్‌, విరాట్‌తోపాటు నేను జట్టులో ఉండడం వల్ల 2011 వరల్డ్‌క్‌పలో ధోనీకి సారథ్యం ఎంతో సులువైంది. అయితే, ఇలాంటి వారిని తయారు చేయడానికి దాదా ఎంతో కష్టపడ్డాడు. అందుకే, గంగూలీ వల్లే ధోనీ ఎన్నో టైటిళ్లు సాధించాడు’ అని గౌతీ చెప్పాడు. మహీ హయాంలోనే టెస్టుల్లో భారత్‌ తొలిసారి నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను కైవసం చేసుకొంది. అయితే, జహీర్‌ ఖాన్‌ వల్లే అది సాధ్యమైందని గౌతీ పేర్కొన్నాడు. ‘టెస్టుల్లో ధోనీ విజయవంతమైన కెప్టెన్‌ అనిపించుకున్నాడంటే జహీర్‌ కారణం. గంగూలీ వల్లే ధోనీకి అలాంటి బౌలర్‌ లభించాడు. నా దృష్టిలో జహీర్‌.. భారత అత్యుత్తమ ప్రపంచస్థాయి బౌలర్‌’ అని స్టార్‌  స్పోర్ట్స్‌ షోలో గంభీర్‌ అన్నాడు. 

Updated Date - 2020-07-12T09:05:06+05:30 IST