భారత్‌లో బయటపడిన గాల్‌బ్లాడర్ గాంగ్రిన్ కేసు

ABN , First Publish Date - 2021-09-18T00:32:02+05:30 IST

గాల్‌బ్లాడర్ గాంగ్రిన్ వ్యాధి కేసు తొలిసారిగా భారత్‌లో బయటపడింది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న ఐదుగురికి ఈ వ్యాధి బయటపడటంతో వైద్యనిపుణులు విస్మయానికి లోనయ్యారు.

భారత్‌లో బయటపడిన గాల్‌బ్లాడర్ గాంగ్రిన్ కేసు

డిల్లీ: గాల్‌బ్లాడర్ గాంగ్రిన్ వ్యాధి కేసు తొలిసారిగా భారత్‌లో బయటపడింది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న ఐదుగురికి ఈ వ్యాధి బయటపడటంతో వైద్యనిపుణులు విస్మయానికి లోనయ్యారు. ఈ ఘటన సర్ గంగారాం ఆసుపత్రిలో చోటుచేసుకుంది. భారత్‌లో ఈ వ్యాధి బయటపడటం ఇదే మొదటిసారని వైద్యులు చెబుతున్నారు. 37 నుంచి 75 ఏళ్ల మధ్య వయసు ఉన్న నలుగురు పురుషులు, ఒక మహిళకు ఈ వ్యాధి సోకింది. జూన్ నుంచి ఆగస్టు మధ్య ఈ ఐదుగురూ కొవిడ్ నుంచి కోలుకున్నారు. 


ఈ వ్యాధి వివరాలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్, గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్ అనిల్ ఆరోరా మీడియాకు వెల్లడిస్తూ.. ‘‘వాంతులు, జ్వరం, ఉదరం కుడి భాగంలో నొప్పి వంటి లక్షణాలతో కొందరు ఆసుపత్రిలో చేరారు. వీరికి పరీక్షలు చేయగా గాల్‌బ్లాడర్ గాంగ్రిన్ అని తేలింది. ప్రస్తుతం ఈ ఐదుగురు రోగులకు లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తున్నాం. గాల్‌బ్లాడర్‌లో వాపు అనేది ఉత్తర భారతదేశంలో సాధారణమైన అంశం. ఈ వ్యాధిని కోలిసైస్టిటిస్ అని పిలుస్తారు. సాధారణంగా 10శాతం మందికి అకాల్య్కులస్ కోలిసైస్టిటిస్ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఫలితంగా ఎటువంటి లక్షణాలు లేకుండానే ఉదరంలో నొప్పి తలెత్తుతుంది. దీంతో గాల్ బ్లాడర్ గాంగ్రిన్ సోకుతుంది ’’ అని చెప్పారు.

Updated Date - 2021-09-18T00:32:02+05:30 IST