అసెంబ్లీలో జరిగిన ఘటన నన్ను కలిచివేసింది: గల్లా జయదేవ్‌

ABN , First Publish Date - 2021-11-22T02:15:46+05:30 IST

ఏపీ అసెంబ్లీలో జరగిన ఘటన తనను కలచివేసిందని ఎంపీ గల్లా జయదేవ్‌ పేర్కొన్నారు. రాజకీయమంటే వ్యక్తిగత దూషణలు

అసెంబ్లీలో జరిగిన ఘటన నన్ను కలిచివేసింది: గల్లా జయదేవ్‌

గుంటూరు: ఏపీ అసెంబ్లీలో జరగిన ఘటన తనను కలచివేసిందని ఎంపీ గల్లా జయదేవ్‌ పేర్కొన్నారు. రాజకీయమంటే వ్యక్తిగత దూషణలు, నేతల కుటుంబ సభ్యులపై దూషణలు చేయటమా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో నేతల దుర్భాషలు పెరిగిపోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. పార్టీల అధినేతలపై దీనిని అదుపు చేయాల్సిన భాధ్యత ఉందని తెలిపారు. లేని పక్షంలో యువతరాన్ని అటువంటి ప్రవర్తనకు ప్రోత్సహించినట్లు అవుతోందన్నారు.  ప్రజాప్రతినిధులుగా మనం ప్రజల నుంచి గౌరవాన్ని ఆశిస్తున్నప్పుడు వారికే కాకుండా... భావితరాలకు ఉన్న ప్రమాణాలను నెలకొల్పాల్సిన బాధ్యత మనపై ఉన్నదంటూ రాజకీయ నేతలకు గుర్తు చేశారు. దీనివల్ల దేశంలో రాజకీయ ప్రమాణాలు, ధర్మం దిగజారే ప్రమాదం ఉందని వివరించారు. రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంత పరంగా విభేదాలు ఉండటం సహజమని.. దానిని ద్వేషంగా భావించకూడదని గల్లా జయదేవ్‌ హితవు పలికారు.

Updated Date - 2021-11-22T02:15:46+05:30 IST