ఈసారైనా ‘గాలి’ వీచేనా...?

ABN , First Publish Date - 2022-05-06T18:15:37+05:30 IST

జిల్లా రాజకీయాలను శాసిస్తున్న ‘గాలి’ బ్రదర్స్‌కు ఈసారైనా మంత్రివర్గంలో స్థానం దక్కేనా.. అనేది మరోసారి అనుచరుల్లో చర్చగా మారింది. గాలి బ్రదర్స్‌లో ఒకరికైనా మంత్రి పదవి ఇవ్వాలని

ఈసారైనా ‘గాలి’ వీచేనా...?

- మంత్రివర్గ విస్తరణపై గాలి బ్రదర్స్‌ ఆశలు 

- కరుణాకర్‌ రెడ్డి, సోమశేఖర్‌రెడ్డిలో ఒకరికి అవకాశం ఇవ్వాలని సీఎం బొమ్మ్తె ఆలోచన

- ఎన్నికల సమయంలో బాధ్యతలు మరింత పెంచాలని కమలదళం వ్యూహం

- అమిత్‌ షా నిర్ణయంపైనే అనుచరుల ఆశలన్నీ..


బళ్లారి(కర్ణాటక): జిల్లా రాజకీయాలను శాసిస్తున్న ‘గాలి’ బ్రదర్స్‌కు ఈసారైనా మంత్రివర్గంలో స్థానం దక్కేనా.. అనేది మరోసారి అనుచరుల్లో చర్చగా మారింది. గాలి బ్రదర్స్‌లో ఒకరికైనా మంత్రి పదవి ఇవ్వాలని సీఎం బొమ్మ్తె తన అత్యంత సన్నిహిత మంత్రితో చర్చించినట్లు సమాచారం. కర్ణాటక రాష్ట్రంలో సీఎం మార్పు, అలాగే మంత్రివర్గం కూర్పు, జరిగే అవకాశం ఉన్నట్లు కమలదళం అంటుంది. కానీ సాధారణ విఽధాన పరిషత్‌ ఎన్నికలు మరో 10 నెలలు మాత్రమే ఉండడంతో సీఎంను మార్చే ప్రయత్నం పెద్దగా చేయక పోయినా... మంత్రి వర్గ విస్తరణపై మాత్రం ఊ హాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నాయకుడు అమిత్‌ షా బెంగళూరు పర్యటనలో కూడా రాష్ట్ర రాజకీయాల పై సు దీర్ఘంగానే చర్చించారు. రాష్ట్రంలో ఉండే 31 జిల్లాల వారీగా నేతల బలాబలాపై చర్చించారు. ఇందులో బాగంగా బళ్లారి నుంచి గాలి బ్రదర్స్‌కు మంత్రి వర్గంలో స్తానం ఇస్తే ఎలా ఉంటుంది.? అనే చర్చకూడా సాగిందని బీజేపీలో ఒక కీలక మంత్రి ఇటీవల పేర్కొన్నారు. గాలి జనార్దన్‌రెడ్డి విషయంలో బీజేపీ చాలా ఆచూతూచీ వ్యవహరిస్తుంది. మైనింగ్‌ వ్యవహారాల్లో అక్రమ కేసులు ఉండే గాలి జనార్దన్‌రెడ్డిని బీజేపీ అంటీ అంటనట్లుగానే ఉంచింది. గాలి జనార్దన్‌రెడ్డి బీజేపీలో ఉన్నారా..? లేదా..? అనే ప్రశ్న ప్రజలు చర్చించుకుంటున్నారు. కానీ ఒక పక్క సోదరుడు గాలి జనార్దన్‌రెడ్డిని దూరం ఉంచి మిగిలిన సోదరులు గాలి కరుణాకర్‌రెడ్డి, గాలి సోమశేఖర్‌రెడ్డిలలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని చర్చలు సాగిస్తున్నారు. గాలి బ్రదర్స్‌లో  బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సో మశేఖర్‌రెడ్డి, హర్పనహళ్లి ఎమ్మెల్యే గాలి కరుణాకర్‌రెడ్డిలకు స్వయానా సోదరుడు గాలి జనార్దన్‌రెడ్డి, అందరిలోనూ గాలి జనార్దన్‌రెడ్డి చిన్నవాడు. ఇక సాధారణ ఎమ్మెల్యే ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీ కొత్త వ్యూహం వేస్తుంది. బళ్లారి జిల్లాకు ఇంత వరకూ మంత్రి పదవి ఇవ్వలేదు. దీనిలో బాగంగానే బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరెడ్డికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని పార్టీలో ఒక కీలక మంత్రి ముఖ్య మంత్రితో చర్చించారని సమాచారం. మచ్చ గాలి కరుణాకర్‌రెడ్డికి అయినా మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని పార్టీ వర్గాలు చర్చించాయి. ప్రస్తుతం బళ్లారి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉండే శ్రీరాములు సొంత నియోజకవర్గం చిత్రదుర్గం జిల్లా మొళకాల్మూరు నియోజకవర్గం ఆ జిల్లా కోటాలో శ్రీరాములుకు మంత్రి పదవి ఇచ్చినా బళ్లారి, లేదా విజయనగర జిల్లాల కోటాలో గాలి సోమశేఖర్‌రెడ్డి, లేదా కరుణాకర్‌రెడ్డిలతో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీలో ఒక కీలక నేత సీఎంతో వివరించి చెబుతున్నట్లు తెలిసింది. ఇందుకు సీఎం కూడా సరే అన్నట్లు తెలిసింది. మెత్తం మీద ఈ సారి అదృష్టం కలిసివస్తే గాలి బ్రదర్స్‌లో ఒకరికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు బీజేపీలో ఆనందం వ్యక్తం అవుతుంది. అయితే గాలి జనార్దన్‌రెడ్డి మాత్రం రాజకీయంగా మౌనంగానే ఉంటున్నారు పార్టీ కూడా ఆ యన్ను పెద్దగా పట్టించుకోకుండా జాగ్రత్త పడుతుందని చర్చలు సాగుతున్నాయి. కనీసం బ్రదర్స్‌లో ఒకరికయినా మంత్రి పదవి దక్కితే జిల్లాలో బలంగా ఉన్న గాలి వర్గీయులకు కాసింత సంతృప్తి దక్కే అవకాశం ఉంది. లేదంటే అసంతృప్తి రగిలినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.



Read more