Advertisement
Advertisement
Abn logo
Advertisement

గాంధీభవన్‌కు చేరిన గజ్వేల్ కాంగ్రెస్ వర్గపోరు

హైదరాబాద్‌: గజ్వేల్ కాంగ్రెస్ వర్గపోరు గాంధీభవన్‌కు చేరింది. నర్సారెడ్డి నాయకత్వాన్ని బండారు శ్రీకాంత్ వర్గం వ్యతిరేకిస్తోంది. పార్టీలు మారిన నేతలకు ప్రాధాన్యం ఎలా ఇస్తారని బండారు శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీకాంత్‌ డిమాండ్ చేస్తున్నారు. బండారు శ్రీకాంత్ నేతృత్వంలో గజ్వేల్ కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్‌కు వచ్చారు. నర్సారెడ్డిని జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని కార్యకర్తల డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement