కొండ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులు
భామిని: ఏనుగుల గుంపు రూటు మార్చింది. ఇప్పటివరకూ మైదా న ప్రాంతాల్లో సంచరించిన గజరాజులు దిశను మార్చాయి. కొంత ప్రాంతం వైపు తరలాయి. దీంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం రాత్రి జక్కరగూడ, జామిగూడ వైపు వెళ్లాయి. దీంతో సమీప నివాసితులు భయపడుతు న్నారు. అయితే కొండ ప్రాంతంలో నీటి సదుపాయం లేకపో వడంతో తిరిగి తాలాడ తోటల వైపు వచ్చే అవకాశముందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం రబీలో భాగంగా రైతులు వివిధ పంటలు వేశారు. ఈ సమయంలో ఏనుగులు సంచరిస్తే నష్టం తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగులను తరలించే ఏర్పాటుచేయాలని కోరుతున్నారు.