ఘనంగా గజ్జలమ్మ కల్యాణం

ABN , First Publish Date - 2021-02-26T05:18:43+05:30 IST

మండల కేంద్రం కుంటాల స్థానిక గజ్జలమ్మ ఆల య వార్షికోత్సవంలో భాగంగా గురువారం కల్యాణమహోత్సవాన్ని అంగ రంగ వైభవంగా నిర్వహించారు.

ఘనంగా గజ్జలమ్మ కల్యాణం
గజ్జలమ్మ కల్యాణాన్ని నిర్వహిస్తున్న పండితులు

కుంటాల, ఫిబ్రవరి 25 : మండల కేంద్రం కుంటాల స్థానిక గజ్జలమ్మ ఆల య వార్షికోత్సవంలో భాగంగా గురువారం కల్యాణమహోత్సవాన్ని అంగ రంగ వైభవంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో మంగళహారతులతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సంద ర్భంగా వేదపండితులు గురుమంచి చంద్రశేఖరశర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండి పలు ప్రత్యేకపూజా కార్యక్రమాలు కొనసాగిస్తూ గజ్జలమ్మ కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. 


Updated Date - 2021-02-26T05:18:43+05:30 IST