గజానికో.. గుంత..!

ABN , First Publish Date - 2022-08-10T05:32:24+05:30 IST

గ్రామీణ రహదారులు హీన స్థితికి చేరుకున్నాయి. గజానికో గుంతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం... రాష్ట్రాన్ని సర్వంగా తీర్చిదిద్దుతామని గొప్పలు చెబుతున్న వైసీపీ ప్రభుత్వం చేసింది మాత్రం శూన్యం

గజానికో.. గుంత..!
మర్తాడు రోడ్డు దుస్థితి

దుస్థితిలో గ్రామీణ రహదారులు

పట్టించుకోని పాలకులు, అధికారులు

గార్లదిన్నె, ఆగస్టు 9 : గ్రామీణ రహదారులు హీన స్థితికి చేరుకున్నాయి. గజానికో గుంతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం... రాష్ట్రాన్ని సర్వంగా తీర్చిదిద్దుతామని గొప్పలు చెబుతున్న వైసీపీ ప్రభుత్వం చేసింది మాత్రం శూన్యం. గ్రామీణ రహదారుల దుస్థితే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. వాటికి మరమ్మత్తులు చేయడాన్ని పూర్తి నిర్లక్ష్యం చేస్తోంది. అడుగుకో గుంతతో.. వర్షాలు వస్తే చెరువులను తలపించేలా ఉన్నాయి.  గార్లదిన్నె మండలం లోని మర్తా డు, కోటంక గ్రామాలకు వెళ్లే రోడ్లు గుంతలు ఏర్పడి చాలా అద్వానంగా ఉన్నాయి. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటేనే గ్రామీణులు భయపడుతున్నారు. వృద్ధులు, గర్భిణుల పాట్లు ఇక వర్ణనాతీతం. వర్షాలు వస్తే రోడ్డుపై ఎక్కడ గుంత ఉందో తెలీక..  వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రమాదాలూ జరిగాయి. అధికారులు, ప్రజాప్ర తినిధులు ఆయా గ్రామాలకు వెళ్లిన సమయంలో ప్రజలు నిలదీస్తే త్వరలోనే రోడ్డు వేస్తామంటు చెబుతున్నారే తప్ప.. ఆచరణ శూన్యం. మర్తాడు నుంచి కోటంక వరకు రోడ్డు మంజురైందని, త్వరలోనే రోడ్డు వేస్తామని ఏళ్లు నుంచి చెబుతున్నారే తప్ప ఇంతవరకూ పనులు ప్రారంభించింది లేదని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


Updated Date - 2022-08-10T05:32:24+05:30 IST