భూముల రీసర్వే సమర్ధవంతంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-04-17T05:53:21+05:30 IST

రైతుల భూములకు హద్దులను తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని సంబంధిత వీఆర్‌ఏలు, రైతులతో కలిసి భూసర్వేను సమర్ధవంతంగా నిర్వహించాలని సర్వేయర్‌ నరసింహారావు పేర్కొన్నారు.

భూముల రీసర్వే సమర్ధవంతంగా నిర్వహించాలి
అవగాహన కల్పిస్తున్న సర్వేయర్‌ నరసింహారావు

కనిగిరి, ఏప్రిల్‌ 16: రైతుల భూములకు హద్దులను తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని సంబంధిత వీఆర్‌ఏలు, రైతులతో కలిసి భూసర్వేను సమర్ధవంతంగా నిర్వహించాలని సర్వేయర్‌ నరసింహారావు పేర్కొన్నారు. పట్టణం, మండలంలోని వార్డు సచివాలయాల సర్వేయర్లకు భూసర్వేపై శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా చోట్ల రైతువారీ పట్టాలకు చెందిన భూములకు రైతులకు కూడా హద్దులు తెలియవని చెప్పారు. ఆయా భూములను సర్వే చేసే సమయంలో రికార్డుల ఆధారంగా, రైతుల వద్ద ఉన్న పట్టాల ఆధారంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిస్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో తహసీల్దార్‌ పుల్లారావు, పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లు, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు. 

పీసీపల్లిలో...

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భూముల రీ సర్వేను నిస్పక్షపాతంగా చేయాలని తహసీల్దార్‌ పి.సింగారావు అన్నారు. శుక్రవారం స్థానిక స్ర్తీ శక్తి కార్యాలయంలో విలేజ్‌ సర్వేయర్లు, మండల సర్వేయర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని పైలెట్‌ ప్రాజెక్ట్‌ క్రింద గోసుగుండాల, పిచ్చిగుంట్లపల్లి రెవెన్యూ గ్రామాలు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ  కార్య దర్శులు, వీఆర్‌వోలు, సచివాలయ కార్యదర్శులు, సర్వేయర్లు, మండల సర్వేయర్లు ఇతర సిబ్బంది ఉన్నారు. 

లింగసముద్రం : పారదర్శకంగా భూ రీసర్వేను చేపట్టాలని తహసీల్దార్‌ ఆర్‌ బ్రహ్మయ్య చెప్పారు. లింగసముద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో రెండు రోజుల నుండి  వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్వే సహాయకులు, ఇంజనీరింగ్‌ సహాయకులకు జరుగుతున్న భూ రీసర్వే శిక్షణా కార్యక్రమం శుక్రవారం ముగిసింది. కార్యక్రమంలో మండల సర్వేయరు ఏడుకొండలు, ఎంఆర్‌ఐ హనుమాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T05:53:21+05:30 IST