రేపు గడిమైసమ్మ బోనాలు

ABN , First Publish Date - 2022-08-13T05:06:19+05:30 IST

రేపు గడిమైసమ్మ బోనాలు

రేపు గడిమైసమ్మ బోనాలు
గడిమైసమ్మ అమ్మవారు

మేడ్చల్‌, ఆగస్టు 12: భక్తులకు కొంగుబంగారంగా భాసిల్లుతున్న మేడ్చల్‌ గడిమైసమ్మ బోనాల పండుగను ఈ నెల 14న నిర్వహిస్తామని ఆలయ కమిటీ తెలిపింది. ఈ బోనాలకు మేడ్చల్‌ పట్టణం, గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. గడిమైసమ్మ బోనాలను పురస్కరించుకొని పట్టణమంతా పండుగ శోభను సంతరించుకుంది. ఆలయాన్ని రంగులతో సుందరంగా తీర్చిదిద్దారు.జాతీయరహదారిపై అమ్మవారి స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 5గంటలకు అమ్మవారికి అభిషేకం, 8గంట లకు సహస్రనామార్చన, కుంకుమార్చన సాయంత్రం ఆలయం నుంచి తొట్టెల ఊరేగింపు, భక్త బృందం భజన తదితర కార్యక్రమాలు ఉంటాయి. 


  • నిరంతరం వెలుగుతున్న అఖండ జ్యోతి

గడిమైసమ్మ మహిమాన్వితురాలని భక్తుల నమ్మకం. 50సంవత్సరాల క్రితం పూర్వ మేడ్చల్‌ తాలూకా తహసీ ల్దార్‌ డి.కె.రామారావుకు అమ్మవారు కలలో కన్పించి తన ఆలయాన్ని నిర్మించాలని కోరడంతో తహసీల్దార్‌ కార్యాల య ఆవరణలోనే ఓ మూలన గుడిని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ విరాజిల్లుతోంది. 1993లో స్థాపించిన అఖండ జ్యోతి నిరంత రం వెలుగుతూనే ఉంది. ఇది అమ్మవారి కృపకు నిదర్శనమని భక్తుల నమ్మకం. ప్రతీ శ్రావణమాసంలో గడిమైస మ్మ బోనాలను నిర్వహించడం ఆనవాయితీ.

Updated Date - 2022-08-13T05:06:19+05:30 IST