రాష్ట్రం గాడిలో పడాలంటే బాబు సీఎం కావాలి

ABN , First Publish Date - 2022-08-17T03:32:55+05:30 IST

అధోగతి పాలైన రాష్ట్రం తిరిగి గాడిలో పడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి

రాష్ట్రం గాడిలో పడాలంటే బాబు సీఎం కావాలి
కరపత్రాలు పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులు ఇంటూరి, తదితరులు

  కందుకూరు, ఆగస్టు 16: అధోగతి పాలైన రాష్ట్రం తిరిగి గాడిలో పడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి  కావాలని  నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు.  బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 14వ వార్డులో మంగళవారం సాయంత్రం ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన నిత్యావసరాల ధరలు, విపరీతంగా పెరిగిపోయిన చార్జీలతో సామాన్యులు జీవించలేని దుస్థితి  వచ్చిందన్నారు. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు  మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దామా మల్లేశ్వరరావు, గుమ్మడి బ్రహ్మయ్య,  కాకుమాని మాల్యాద్రి, కల్లూరి కృష్ణమోహన్‌, గళ్లా రమణయ్య, జంపాల శ్రీకాంత్‌, ముచ్చు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-17T03:32:55+05:30 IST