Advertisement
Advertisement
Abn logo
Advertisement

గాంధీతత్వంపై ప్రచారం భేష్‌

ఏఐఆర్‌ మాజీ డైరెక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌ 


కాళ్ళ, అక్టోబరు 26 : గాంధీతత్వం ప్రచారంలో జిల్లా ముందంజలో ఉందని ఏపీ గాంధీయన్‌ తింకర్స్‌ ఫోరం కన్వీనర్‌, ఏఐఆర్‌ మాజీ డైరెక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌ అన్నారు. కాళ్ళ మండలం పెదఅమిరం మహాత్మ గాంధీ ట్రస్టు లో మంగళవారం నిర్వహించిన గాంధీ స్ఫూర్తి కార్యక్రమానికి హాజరయ్యారు. పాఠశాల స్థాయిలోనే మంచి విషయాలపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలని ఎంజీఎం ట్రస్ట్‌ అధినేత డా.ఎంఆర్‌ రాజు అన్నారు. స్వాతంత్య్ర సమరయోధురాలు ఎం.సుభద్రాదేవి మాట్లాడుతూ సత్యమార్గంలోనే విజయాలు సాధించవచ్చుని గాంధీ నిరూపించారన్నారు. నేటి తరం కూడా అలాగే ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, కేవీబీ.మురళీకృష్ణ, శ్రీనివాస్‌, గాంధీ స్మారక నిధి సభ్యులు, సర్వోదయ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement