Abn logo
Sep 21 2021 @ 00:40AM

ఎంపీ సురేష్‌ దాడులను ప్రోత్సహిస్తున్నారు..

చిన్నాపై దాడిని ఖండిస్తూ ప్రదర్శనగా పోలీస్‌ స్టేషన్‌కు వెళుతున్న రాజధాని రైతులు, మహిళలు

అమరావతి దళిత జేఏసీ నేతల ఆరోపణ

తుళ్లూరు, సెప్టెంబరు 20: అసాంఘిక శక్తులకు ఎంపీ నందిగం సురేష్‌ ఆశ్రయం ఇచ్చి దాడులను పోత్సహిస్తున్నాడని దళిత జేఏసీ కన్వీనర్‌ గడ్డం మార్టిన ఆరోపించారు. అమరావతి రాజధాని దళిత రైతు జేఏసీ కో కన్వీనర్‌ పులి చిన్నాపై దాడిని ఖండిస్తూ సోమవారం రైతులు, మహిళలు తుళ్ళూరు రైతు ధర్నా శిబిరం నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఐ దుర్గాప్రసాద్‌కు ఫిర్యాదు అందజేశారు. ఈ  సందర్భంగా మార్టిన మాట్లాడుతూ చిన్నాపై దాడికి ఎంపీ సురేష్‌ కారకుడని ఆరోపించారు. ఎంపీపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఐకాసా కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌ మాట్లాడుతూ శాంతియుతంగా జరుగుతున్న అమరావతి ఉద్యమాన్ని అశాంతిగా మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. పులి చిన్నా భార్య సువార్త మాట్లాడుతూ  రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న తన భర్తపై ఎంపీ సురేష్‌ దాడి చేయించారన్నారు. ఎంపీపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.