చేవూరులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి
గుడ్లూరు, మే 21 : మండలంలోని చేవూరులో శనివారం గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిం చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని రెండు ఎస్సీ కాలనీల్లో పలువురికి నేటికి ఇళ్ల స్థలాలు లేవని ఆయా కాలనీల మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వరరావు, తహసీల్దార్ లావణ్య, మండల వైసీపీ కన్వీనర్ కాపులూరి కృష్ణ, నాయకులు పూసపాటి సుబ్బరాజు, శెట్టిపల్లి వెంకటేశ్వర్లు, చాపల రమణయ్య తదితరులు పాల్గొన్నారు.