పలుకూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహీధరరెడ్డి, తదితరులు
కందుకూరు, మే 24: మండలంలోని పలుకూరులో మంగళవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి మూడేళ్లలో ప్రభుత్వం నుంచి అందిన ఆర్థిక సహాయం వివరాలను వారికి తెలియజేశారు. ఎమ్మెల్యే వివరిస్తున్న సమయంలో పెద్దగా స్పందించని మహిళలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చేందుకు మాత్రం పోటీపడ్డారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయశేఖర్, తహసీల్దార్ సీతారామయ్య, సర్పంచు వీరమల్లు శ్రీను, కోవూరు సర్పంచు ఆవుల మాధవరావు, కొండి కందుకూరు సర్పంచు కుమ్మర బ్రహ్మయ్య, విక్కిరాలపేట సర్పంచు జి. వెంకటరావు పాల్గొన్నారు.