అమరావతి: ఐఆర్ అడ్జస్ట్‌మెంటుపై జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఆర్ అడ్జస్ట్‌మెంట్ కింద ఎంత మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నారనే అంశంపై సమాధానాన్ని ఆయన దాటేవేశారు. ఐఆర్ అడ్జస్ట్‌మెంట్ అనేది ఒక్కొక్కరు ఒక్కో తరహా పదాన్ని వాడతారని ఆయన తెలిపారు. ప్రభుత్వం సర్దుబాటు అంటుందని, సామాన్యులు రికవరీ అంటారని ఆయన పేర్కొన్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగికి డబ్బులు రావాల్సి ఉంటే ఏరియర్స్ అంటారన్నారు. అదే ఉద్యోగి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటే నెగెటీవ్ ఏరియర్స్ అంటారని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి
జీతాల్లో రికవరీ వద్దని హైకోర్టు ఉత్తర్వులు ఉంటే ప్రభుత్వం ఆ ఉత్తర్వులను అమలు చేస్తుందని సీఎస్ సమీర్ శర్మ పేర్కొన్నారు. ఉద్యోగులు సమ్మెకు వెళితే ఏమవుతుందో తెలియదని వారు అన్నారు. మాట్లాడడానికి ముందస్తు షరతులు పెట్టకూడదన్నారు. మాట్లాడక పోతే వారికి ఏమి కావాలో ఇప్పటికీ తెలియడం లేదున్నారు. ఐ ఆర్ విషయంలో గతంలో అడ్జెస్ట్‌మెంట్ లేదన్నారు. అయితే ఇప్పుడు చాలా లాంగ్ పీరియడ్ ఐఆర్ ఇచ్చామని, అందుకే ఈ అడ్జెస్ట్‌మెంట్ అని ఆయన పేర్కొన్నారు.