gachibowli గోపన్‌పల్లిలో ఉద్రిక్తత వాతావరణం

ABN , First Publish Date - 2021-11-06T16:27:08+05:30 IST

గచ్చిబౌలి గోపన్‌పల్లిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గోపన్‌పల్లి-తెల్లపూర్ మధ్య కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులను అధికారులు ప్రారంభించారు. అయితే.. గోపన్‌పల్లితండాలో రోడ్డుకు

gachibowli గోపన్‌పల్లిలో ఉద్రిక్తత వాతావరణం

హైదరాబాద్: గచ్చిబౌలి గోపన్‌పల్లిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గోపన్‌పల్లి-తెల్లపూర్ మధ్య కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులను అధికారులు ప్రారంభించారు. అయితే.. గోపన్‌పల్లితండాలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిర్మాణాలను..కూల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నిర్మాణాలను కూల్చేందుకు వచ్చిన అధికారులపై స్థానికులు తిరగబడ్డారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ ఆందోళనకు దిగారు. అధికారులు పోలీసులకు సమాచారం గోపన్‎పల్లితండాకు చేరుకున్నారు. ఎటువంటి సమాచారం లేదు, నోటీసులు లేకుండా ఎలా కూల్చేస్తారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-11-06T16:27:08+05:30 IST