బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో యంగ్ హీరో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'గాలి సంపత్'. నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్ పోషించారు. అనిల్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశాడనే విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి కో-డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మహాశివరాత్రి కానుకంగా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ స్టార్ రామ్ ముఖ్య అతిథిగా హాజరై గాలి సంపత్ బిగ్ టికెట్‌ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా టైటిల్ రోల్ పోషించిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ''గాలి సంపత్ సినిమా చూశాక నాకు రెండు మూడు విషయాలు అర్థం అయ్యాయి. జీవితంలో మనం ఏం చేసినా భగవంతుడు మనకు ఇచ్చే అవకాశం. అది రానిదే ఎవరూ జీవితంలో ఏమీ చేయలేరు. 44 సంవత్సరాల సినిమా జీవితం.. నన్ను నటుడిగా నిలబెట్టిన మొదటి సినిమా లేడీస్ టైలర్. ఆ సినిమా లేకపోతే నేను లేను. ఇక నా జీవితంలో జన్మాంతం నటుడిగా గుర్తుంచుకునే ఒక అద్భుతమైన కథ రాశారు ఎస్. కృష్ణ. ఆ కథకి ఆయన్నే నిర్మాతగా మార్చారు నన్ను డాడీ అని పిలిచే అనిల్ రావిపూడి. ఈ కథ చెప్పగానే నేను భయపడ్డాను. మాటలు లేకుండా ఎలా అనుకున్నాం. కానీ కరోనా తర్వాత ఫుల్ ఎనర్జీతో సినిమా చేశారు. నా జీవితంలో మర్చిపోలేని సినిమా ఇది. శ్రీ విష్ణుతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. లవ్లీ సింగ్ బాగా చేసింది. అనీష్ అద్భుతంగా తెరకెక్కించాడు. గాలి సంపత్ నా జీవితంలో ఒక ఆణిముత్యం" అన్నారు.
జెన్యూన్ థాట్‌తో అనిల్ ఈ సినిమాకి సపోర్ట్ చేశారు.
ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. ''గాలి సంపత్ టీమ్‌ని విష్ చేయడానికి రామ్ రావడం ఒక మంచి ఇన్షియేటివ్. రోజూ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, రిలీజ్‌లతో టాలీవుడ్ షైన్ అవుతోంది. హీరోలు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం మంచి పరిణామం. మంచి హార్ట్ ఉంటేనే అలా చేయడం సాధ్యం అవుతుంది. షైన్ స్క్రీన్స్ లో నేను రెండు సినిమాలు చేశాను. నా హోమ్ బ్యానర్ లాంటిది. అనిల్ రావిపూడి చాలా క్లోజ్ పర్సన్. అనిల్ చేయాలనుకున్నది తప్పకుండా చేస్తాడు.. సక్సెస్ అవుతాడు. గాలి సంపత్‌లాంటి ఒక మంచి కాన్సెప్ట్ సాయి రాసి తీసుకొచ్చినప్పుడు ఇలాంటి సబ్జెక్ట్స్‌కి నా సపోర్ట్ ఉంటే ఎలివేట్ అవుతుంది అనే ఒక జెన్యూన్ థాట్‌తోనే ఈ సినిమాకి సపోర్ట్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి ఎక్స్ట్రార్డినరీ ఆర్టిస్ట్ ని పట్టుకుని ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ శ్రీవిష్ణు లాంటి మంచి హీరోతో చేయడం నిజంగా అభినందనీయం. సాయి కూడా చాలా కాలంగా తెలుసు. ఇలాంటి కాన్సెప్ట్స్‌తో నిర్మాతగా మారుతున్నందుకు హ్యాపీగా ఉంది" అన్నారు.
సంగీత దర్శకుడు అచ్చురాజమణి మాట్లాడుతూ.. ''ఇంత మంచి సినిమాకి సంగీతం చేసే అవకాశం ఇచ్చిన అనిల్‌గారికి థ్యాంక్యూ. ఈ సినిమా తప్పకుండా బిగ్ హిట్ అవుతుంది. నిర్మాతలు సాయి, సాహూ గారపాటి గారికి మై కంగ్రాట్స్" అన్నారు.
హీరోయన్ లవ్లీ సింగ్ మాట్లాడుతూ.. ''ఇది నా ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. స్పెషల్‌డే.. ఇంత మంచి అవకాశం ఇచ్చిన అనిల్, అనీష్, సాయి గారికి థ్యాంక్స్. మార్చి 11న తప్పకుండా గాలి సంపత్ సినిమా చూసి అందరూ ఎంజాయ్ చేయండి" అన్నారు.