సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన జీపీ గార్గ్

ABN , First Publish Date - 2020-08-15T01:35:26+05:30 IST

మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా జీపీ గార్గ్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు...

సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన జీపీ గార్గ్

న్యూఢిల్లీ: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా జీపీ గార్గ్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. తన పదోన్నతికి ముందు గార్గ్ సెబీ చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. 1994లో సంస్థలో చేరిన ఆయన.. పలు కీలక అంశాల్లో విశేష సేవలు అందించినట్టు సెబీ పేర్కొంది. దేశంలో ఆర్థిక అక్షరాస్యత, పెట్టుబడుల విద్య కోసం సెబీ చేపట్టిన పలు కార్యక్రమాలతో పాటు.. జాతీయ సెక్యురిటీస్ మార్కెట్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్ఐఎస్ఎమ్) ఏర్పాటులో గార్గ్ కీలక పాత్ర పోషించారు. ఇంజినీరింగ్‌తో పాటు న్యాయశాస్త్రం, మేనేజ్మెంట్ అంశాల్లోనూ ఆయన డిగ్రీలు చేశారు. 

Updated Date - 2020-08-15T01:35:26+05:30 IST