Abn logo
Jan 16 2021 @ 23:49PM

పసుపు రైతుకు ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ శాపం

పసుపు ధర పెరగకపోవడానికి ఇదో కారణం

 ఏడేళ్ల క్రితం ఫ్యూచర్‌లోకి.. అప్పటి నుంచి ధర అంతంతే!

 తొలగించాలని టాస్క్‌ఫోర్స్‌ సైతం సిఫారసు

ఆర్మూర్‌, జనవరి 16: పసుపు ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ రైతులకు శాపంగా తయారైంది. పసుపు ఫ్యూచర్‌ ట్రేడిం గ్‌ చేస్తున్నప్పటి నుంచి ధర పెరగడం లేదు. 2013 జూలై 31న కమొడిటిస్‌ జాబితాలో చేర్చారు. పసుపునకు మద్ద తు ధర లేదు. మార్కెట్‌లో ఎప్పుడు ఏ ధర ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొం ది. మరికొన్ని వ్యవసాయోత్పత్తులు కమొడి టిస్‌లో ఉన్నప్పటికీ వాటికి మద్దతు ధర ఉం డడం వల్ల పెద్దగా నష్టం లేదు. పసుపునకు మద్దతు ధర లేనందున రైతులకు నష్టం జరు గుతోంది. ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ వల్ల గిట్టుబాటు ధర లభిస్తుందని మొదట్లో రైతులు భావించారు. కానీ ఇది ప్రారంభమైనప్పటి నుంచి ధర పెరగడంలేదు. అన్‌ సీజన్‌లోనూ ధర పెరగడంలేదు. పసుపు ఫిబ్ర వరి నుంచి మార్కెట్‌కు వస్తుంది. కొత్త పసుపు మా ర్కెట్‌లోకి రాక ముందు అక్టోబరు, నవంబరు నెలల్లో ధర పెరిగేది. మార్కెట్‌లో పసుపు కొరత ఉండడంతో ధర పెరిగేది. కానీ ప్ర స్తుతం అక్టోబరు, నవంబరులో నూ ధర పెరగడం లేదు. సీ జన్‌లో ఎంత ఉందో, అన్‌ సీజన్‌లోనూ అంతే ఉం టుంది. ఆన్‌లైన్‌లో ముందుగానే ధర ని ర్ణయించడంతో ధర ను ప్రభావితం చేస్తో ంది. 13ఏళ్ల క్రితం ప సుపు ధర క్వింటాకు రూ.17వేలకు చే రింది. ఆ తర్వాత కొంతకాలం రూ.8నుంచి రూ.10వేల వరకు నిలకడగా ఉంది. 12, 13ఏళ్ల క్రితం లభించిన ధరలో సగం కూడా లభించడంలేదు. ప్రస్తుతం ధర కొంత అ టు, ఇటుగా రూ.5వేలు మాత్రమే ఉంది. 12ఏళ్ల క్రితం నాటి పెట్టుబడి రెండు, మూడింతలైంది. పసుపు ధర మాత్రం సగా నికి పోవడంతో రైతులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. ఇలా ంటి పరిస్థితి ఏ పంటలో లేదు. ఇతర ఉత్పత్తి రంగాలలో కూ డా లేదు. ప్రస్తుత పరిస్థితి లేదు. రైతు కుటుంబసభ్యుల కాయ కష్టం పోగా నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. 

 తొలగించాలని సిఫారసు చేసిన టాస్క్‌ఫోర్స్‌ 

పసుపు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి ఇటీవల కేం ద్రం అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రై తులు, అధికారుల అభిప్రాయాలు సేకరించింది. ధర ఎందుకు పెరగడంలేదనేది పరిశీలించింది. టాస్క్‌ఫోర్స్‌ పరిశీలనలో పసు పు ధర పెరగకపోవడానికి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ కూడా కారణమని తేలింది. ఆన్‌లైన్‌ ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ నుంచి పసుపును తొలగిం చాలని వ్యవసాయ మంత్రిత్వశాఖకు సమర్పించిన నివేదికలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పేర్కొంది.

ఈయేడూ అదే పరిస్థితి 

ఈయేడు కూడా పసుపు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఆర్మూర్‌ డివిజన్‌లో సుమారు 33వేల ఎకరాల్లో పంట సాగవుతోంది. పూర్వీకుల నుంచి వంశపారంపర్యంగా సంప్రదాయంగా పసుపు సాగుచేస్తున్నారు. మద్దతు ధర లేద ని, గిట్టుబాటు కాదని తెలిసినప్పటికీ పసుపుపై మమకారంతో పెద్దల నుంచి వచ్చిన ఆచారంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుత మున్న ధర రైతులకు గిట్టుబాటు కాదు. సీజన్‌లో ఎంత వరకు దిగిపోతుందో అన్నదే రైతులకు పెద్ద భయంగా తయారైంది. అన్ని పంటల కంటే పసుపు సాగు రిస్కుతో కూడుకున్నది. ఆ ర్మూర్‌ ప్రాంతంలో ఎక్కువగా దీర్ఘకాలిక రకమైన ఎర్రగుం టూరు సాగు చేస్తారు. దీనిని తొమ్మి ది నెలల సాగు చేయడం ఒక సమస్య అయితే, ఉడకబెట్టి, ఎం డబెట్టి, మార్కెట్‌కు తీసుకరావడం మరింత సమస్య అవుతోం ది. ఇంతచేసి గంజ్‌లో దళారీ చెప్పిన ధరకు ఇవ్వాల్సి వస్తోంది.

 ఆదుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

పసుపు రైతులు నష్టాల్లో ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ఆదుకోవడంలేదు. కేంద్రంలో ఒక పార్టీ ప్రభుత్వం, రాష్ట్రం లో మరో పార్టీ ప్రభుత్వం ఉండడంతో దీనిని రాజకీయ కోణం లో చూస్తున్నారు. కానీ రైతులకు న్యాయం జరిగేలా కృషి చేయ డం లేదు. గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని హా మీ ఇచ్చి ఎంపీ అర్వింద్‌ విఫలమయ్యారని టీఆర్‌ఎస్‌ నాయకు లు విమర్శిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇస్తే ఎంఐఎస్‌ కింద క్వింటాకు రూ.10వేలకు కొనుగోలు చేయడానికి కేంద్రాన్ని ఒప్పి స్తానని ఎంపీ అర్వింద్‌ అంటున్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంఐఎస్‌ కింద క్విం టాకు రూ.4వేలకు కొనుగోలు చేయడం వల్ల మార్కెట్‌లో ప్రైవే టు వ్యాపారులకు పోటీరావడంతో ధర పెరిగింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ కొనుగోలు చేయలేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో కేంద్ర మంత్రి శరద్‌పవర్‌ ఎంఐఎస్‌ కిం ద పసుపు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా స్పంది ంచలేదు. సగం భరించాల్సి ఉంటుందనే ఉద్దేశంతో కిరణ్‌ కు మార్‌రెడ్డి ప్రభుత్వం స్పందించలేదు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎస్‌ కింద కొనుగోలుకు ముందుకు రావాలని, కేంద్రం ఆన్‌ లైన్‌ ట్రేడింగ్‌ నుంచి తొలగించాలని రైతులు కోరుతున్నారు.

నేడు పసుపు రైతుల సమావేశం 

నిజామాబాద్‌ అర్బన్‌: పసుపునకు మద్దతు ధర.. నిజామాబాద్‌ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు కోసం గత పార్లమెం ట్‌ ఎన్నికల్లో పోటీచేసిన పసుపు రైతులు, ఎంపీ అభ్యర్థులతో చర్చించేందుకు ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు  ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో జరుగుతున్నటువంటి వ్యవసాయ సంబంధిత వ్యవహారాలు, పసుపు బోర్డు, మద్దతు ధర విషయంలో టీఆర్‌ఎస్‌, బీజేపీలు వ్యవహరిస్తున్న తీరు గురించి  చర్చించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement