Abn logo
Oct 2 2021 @ 00:00AM

భవిష్యత్ ‘లైవ్ కామర్స్ దే’

కొవిడ్‌ సంక్షోభంతో కొనుగోలు విధానం ఆసాంతం మారిన విషయం తెలిసిందే. ప్రత్యక్షంగా వస్తువును చూడకుండానే అన్‌లైన్‌లో వస్తువును ఆర్డర్‌ చేసుకునే విధానం ముమ్మరమైంది. ప్రస్తుతం కొంత వెసులుబాటు లభించినప్పటికీ జనసమ్మర్థంగా ఉన్న చోట్లకు వెళ్ళేందుకు ప్రజలు ఇంకా భయపడుతున్నారు. థర్డ్‌ వేవ్‌, వేరియెంట్స్‌ ఇంకా బెంబేలెత్తిస్తూనే  ఉన్నాయి. భవిష్యత్తులో ఆన్‌లైన్‌ కొనుగోళ్లు కూడా తగ్గి ‘లైవ్‌ కామర్స్‌’లోనే సాగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీన్నే మూడు పదాల్లో లైవ్‌, షాపబుల్‌ కామర్స్‌గా అంటున్నారు. 


సింపుల్‌గా చెప్పాలంటే ఈ కామర్స్‌కు సోషల్‌ మీడియాకు మంచి అనుసంధానంగా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలు కావాల్సిన వివరాలను అందిస్తున్నాయి. ఏదైనా కొనుగోలు చేయాలని వెతకడం ఆరంభిస్తే నేరుగా ప్రొడక్ట్‌ పేజీ దగ్గరకు వెళ్ళగలుగుతున్నాం. ఇక్కడ ఫొటోలు, వీడియోల మధ్య యుద్ధం జరుగుతుంది. సహజంగానే వీడియోలు విజయం సాధిస్తాయి. అయితే దీని తరవాతి స్థాయి రియల్‌ టైమ్‌ షాపింగ్‌. ఇందులో వివిధ వస్తువులు పెద్దఎత్తున ఒకే చోట పోగుపడి ఉంటాయి. అక్కడ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఎంచి చూసి నిర్ణయం తీసుకునే వెసలుబాటు ఉంటుంది. పోటీ, ఆనందాన్ని అక్కడికక్కడే వ్యక్తం చేయడం సరేసరి. ఇవన్నీ ఇన్‌-పర్సన్‌ కామర్స్‌లో పొందవచ్చు. ఈకామర్స్‌ వెబ్‌సైట్లన్నీ దాదాపుగా ఒకేలా ఉంటాయి. ధరల పట్టికతో వస్తువులు కనిపిస్తాయి. మహా  అయితే వస్తువు వివరాలతో వీడియో ఉంటుంది. లైవ్‌లో అంతకుమించి ఉంటుంది. ఉదాహరణకు ఒక డ్రెస్‌ తీసుకుంటే, నిశ్చలంగా ఉండే ఫొటో సింగిల్‌ పోజ్‌కే పరిమితం. అయితే షాపింగ్‌ కోసం ఎక్కువ సమయం వెచ్చించేలా చేయడం లైవ్‌ షోతో సాధ్యమవుతుంది. కస్టమర్‌ సంతృప్తి ఇక్కడ ముఖ్యం. అందుకు అనుగుణంగా అదనపు జోడింపులు కలపాలి. లైవ్‌ కామర్స్‌లోనూ ఇప్పటికే చైనా పురోగతి సాధించింది. మరో రెండేళ్ళలో వంద బిలియన్ల మార్కెట్‌గా  పెంచుకునేందుకు పరుగులు తీస్తోంది. కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలో పదిహేను వేల బాటిళ్ళ మేరకు సెంటు సీసాలు అమ్ముడయ్యాయంటే లైవ్‌కామర్స్‌కు ఉన్న ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. రియల్‌ టైమ్‌ లైవ్‌ ఈవెంట్స్‌తో కస్టమర్‌కు దగ్గరయ్యే పద్ధతులు ఇక్కడ అమలవుతాయి.ప్రొడక్ట్‌ ఆరంభ కార్యక్రమాలు, సెలబ్రిటీలతో ఇంటరాక్షన్లు, థీమాటిక్‌ సేల్స్‌, పర్సనలైజేషన్‌ కూడా ఉంటాయి.  క్యూఆర్‌  కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా మొత్తంగా ఈ ప్రోగ్రామ్‌లను వీక్షించే వెసులుబాటు లభిస్తుంది. ఇవి షాపింగ్‌, స్వైపింగ్‌, ఇంటరాక్టివ్‌గా ఉంటాయి. ఇటు  వినియోగదారుడికి కూడా పూర్తి  స్థాయిలో సంతృప్తి పొందే స్థాయిలో కంట్రోల్‌ ఉంటుంది. మొత్తమ్మీద   వస్తువును పూర్తి అవగాహన కలిగిన తరవాతే, కొనుగోలు చేసేవిధంగా పరిస్థితిలో మార్పు వస్తోంది. అంటే వస్తువు నాణ్యతను లైవ్‌ షోలో తెలుసుకుని, కొనుగోలు చేసే పద్ధతిలోకి మార్పు కదులుతోంది.

ప్రత్యేకం మరిన్ని...