Abn logo
Mar 5 2021 @ 01:08AM

మరింత తగ్గిన బంగారం, వెండి

విలువైన లోహాలు మరింత దిగివచ్చాయి. ఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.217 తగ్గి రూ.44,372కు పరిమితమైంది. కిలో వెండి రేటు రూ.1,217 తగ్గి రూ.66,598 కు జారుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండికి డిమాండ్‌ తగ్గుతూ వస్తుండటంతో దేశీయంగా ధరల తగ్గుదలకు దోహదపడుతోంది. అంతర్జా తీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ఒక దశలో 1,717 డాలర్లు, సిల్వర్‌ 26 డాలర్ల స్థాయిలో ట్రేడయింది. 

Advertisement
Advertisement
Advertisement