క్రీడా మైదానాల ఏర్పాటుతో మరింత ప్రోత్సాహం

ABN , First Publish Date - 2022-08-19T06:29:21+05:30 IST

క్రీడా మైదానాల ఏర్పాటుతో క్రీడలకు మరిం త ప్రోత్సాహం లభిస్తుందని, రాష్ట్రంలో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిం చేందుకే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్‌ రవి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత, జిల్లా ఎస్పీ సింఽధూశర్మ అన్నారు.

క్రీడా మైదానాల ఏర్పాటుతో మరింత ప్రోత్సాహం
బహుమతులు అందిస్తున్న అతిథులు

కలెక్టర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌, ఎస్పీ  

జగిత్యాల అర్బన్‌, ఆగస్టు 18: క్రీడా మైదానాల ఏర్పాటుతో క్రీడలకు మరిం త ప్రోత్సాహం లభిస్తుందని, రాష్ట్రంలో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిం చేందుకే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్‌ రవి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత, జిల్లా ఎస్పీ సింఽధూశర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక మినీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఫ్రీడం కప్‌ పోటీల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అ తిథులుగా హాజరై మాట్లాడుతూ వజ్రోత్సవాల్లో యువతను భాగస్వామ్యం చేస్తూ, యువతలో దేశభక్తి, స్నేహభావం పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఫ్రీడమ్‌ కప్‌ పోటీలను ప్రభుత్వం నిర్వహించిందన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడ లపై ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ, స్పోర్ట్స్‌ అధికారి డాక్టర్‌ భోనగిరి నరేష్‌, బల్దియా కమిషనర్‌ స్వరూ పారాణి, ఎంపీడీవో రాజేశ్వరీ, బాలల సంరక్షణ అధికారి హరీష్‌తో పాటు క్రీడాకారులు, క్రీడాభిమానులున్నారు.

Updated Date - 2022-08-19T06:29:21+05:30 IST