చంద్రబాబు సమీక్షలకు ముమ్మర ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-07-03T05:09:15+05:30 IST

కలికిరిలో ఈ నెల 7వ తేదీన జరుగనున్న టీడీపీ రాజంపేట పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆ పార్టీ జాతీయ అఽధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జరుపనున్న సమీక్షా సమావేశాలకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

చంద్రబాబు సమీక్షలకు ముమ్మర ఏర్పాట్లు
చంద్రబాబు సమీక్షల కోసం ముస్తాబవుతున్న కల్యాణమండపం

కలికిరి, జూలై 2: కలికిరిలో ఈ నెల 7వ తేదీన జరుగనున్న టీడీపీ రాజంపేట పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆ పార్టీ జాతీయ అఽధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జరుపనున్న సమీక్షా సమావేశాలకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోని పుంగనూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటి, కోడూరు, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులతో ఆయన విడివిడిగా కలికిరిలో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల కోసం రాయచోటి మార్గంలోని హేమాచారి కల్యాణ మండపాన్ని ఎన్నిక చేసిన విషయం తెలిసిందే. కల్యాణ మండపం ఆవరణకు ఎదురుగా పార్కింగ్‌ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మండపం లోపల సమావేశాలు జరుగునుండగా వెలుపల భోజనాల కోసం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. 7వ తేదీ (గురువారం) ఉదయం అల్పాహారాలు, మధ్యాహ్నం, రాత్రి పది వేల వంతున భోజనా లు చేయడానికి వీలుగా ఈ కౌంటర్లను రూపుదిద్దుతున్నారు. అంతేగా కుండా ముందు రోజు సాయంకాలం మదనపల్లెలో మినీ మహానాడులో పాల్గొన్న అనంతరం చంద్రబాబు నాయుడు రాత్రికి కలికిరి చేరుకోనున్నా రు. దీంతో కల్యాణ మండపం సమీపంలోనే ఆయనకు రాత్రి బస కోసం వసతులు కల్పిస్తున్నారు. బుధవారం మినీ మహానాడు పూర్తికాగానే మదనపల్లె నుంచి కలికిరి చేరుకునే వరకూ చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌ వెంబడి వేలాది వాహనాలు అనుసరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, పీలేరు ఇన్‌చార్జి నల్లారి కిశోర్‌కు మార్‌ రెడ్డి జరుగుతున్న ఏర్పాట్లను ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నారు. ఏడు నియోజకవర్గాల నుంచి హాజరయ్యే పార్టీ ప్రతినిధులకు ఇచ్చే ఆతిథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జరిగేందుకు అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమీక్షా సమావేశాల ఏర్పాట్లను కిశోర్‌కుమార్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎప్పటికప్పుడు సూచనలిస్తున్నారు. ఇప్పటికే మదనపల్లె నుంచి సమావేశాల వేదిక వరకూ దారి పొడవునా స్వాగత బ్యానర్లు, కటౌట్లు, ఆర్చీల ఏర్పాటుకు పార్టీ శ్రేణులు పోటీలు పడి ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు పీలేరు నియో జకవర్గంతో సమీక్షా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం వరుసగా ఏఏ నియోజకవర్గాలతో సమీక్షలు జరిపేది తరువాత ప్రకటించ నున్నారు. ఒక్కో నియోజకవర్గం సమీక్ష కోసం కనీసం రెండు గంటలు కేటాయించనున్నారు. ఈ సమీక్షా సమావేశాల్లో పార్టీ ప్రతినిధులతో సుదీ ర్ఘంగా చర్చించిన అనంతరం కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను పార్టీ అధ్యక్షుడు ప్రకటించే అవకాశముందని చెపుతు న్నారు. 

35 ఏళ్ల తర్వాత కలికిరిలో బస చేయనున్న చంద్రబాబు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాదాపు ముప్పై ఐదే ళ్ల తరువాత కలికిరిలో బస చేయనున్నారు. 1988 వాయల్పాడు శాసన సభకు జరిగిన ఉప ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థి ప్రస్తుత పీలేరు వైసీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గెలుపు కోసం చంద్రబాబు నాయుడు కలికిరిలోనే మకాం వేశారు. విద్యుత్‌ శాఖ అతిథి గృహంలో ఆయన దాదాపు పదిహేను రోజులపాటు ఉప ఎన్నికల వ్యూహ రచనల తో ఊపిరి సలపకుండా గడిపారు.  సుదీర్ఘ విరామం తరువాత తిరిగి చంద్రబాబు బుధవారం రాత్రి కలికిరిలో బస చేయనున్నారు. సమీక్షా సమావేశాల అనంతరం ఆయన గురువారం రాత్రి చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. 

Updated Date - 2022-07-03T05:09:15+05:30 IST