Viral Video: ఈ ఆవు స్వతహాగా తల తిప్పినా.. కారు డ్రైవర్‌కు కరెక్ట్‌గా సెట్ అయింది.. కావాలంటే మీరే చూడండి..

ABN , First Publish Date - 2022-03-17T02:44:10+05:30 IST

తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఆవు ప్రవర్తన చూడటానికి మాత్రం, కారు డ్రైవర్‌కు అడ్రస్ చెబుతున్నట్లుగా ఉంది. కారు ఆపిన డ్రైవర్.. ఆవును అడ్రస్ అడుగుతాడు. అందుకు ఆ ఆవు కూడా..

Viral Video: ఈ ఆవు స్వతహాగా తల తిప్పినా.. కారు డ్రైవర్‌కు కరెక్ట్‌గా సెట్ అయింది.. కావాలంటే మీరే చూడండి..

జంతువులు కొన్ని సార్లు చేసే పనులు.. చూడటానికి మనుషులను అనుకరించినట్లుగానే ఉంటాయి. కొన్నింటికి శిక్షణ ఇవ్వడం వల్ల మనుషులను అనుకరించడాన్ని చూస్తుంటాం. అయితే మరికొన్ని జంతువులు ఎలాంటి శిక్షణ లేకుండానే అచ్చం మనుషుల్లా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో చాలా చూస్తుంటాం. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఆవు ప్రవర్తన చూడటానికి మాత్రం, కారు డ్రైవర్‌కు అడ్రస్ చెబుతున్నట్లుగా ఉంది. కారు ఆపిన డ్రైవర్.. ఆవును అడ్రస్ అడుగుతాడు. అందుకు ఆ ఆవు కూడా ఏమాత్రం లేటు చేయకుండా ఇటే వెళ్లు.. అన్నట్లుగా తల తిప్పడం.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


ట్విటర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ప్రధాన రహదారిలో ఓ కారు వేగంగా వెళ్తుంటుంది. అదే సమయంలో ఎదురుగా కొన్ని ఆవులు వస్తుంటాయి. కారు డ్రైవర్ వాటిని చూసి వాహనాన్ని ఆపుతాడు. అప్పుడే ఓ ఆవు సమీపానికి వచ్చి ఆగుతుంది. అప్పుడే ఆ కారులోని వారు.. గుడ్ ఆప్టర్ నూన్ ఆవుగారూ! బోలోనియా అనే ప్రాంతానికి ఎలా వెళ్లాలో కాస్త చెబుతారా.. అని అడుగుతారు. దానికి ఆ ఆవు.. ఇటే నేరుగా వెళ్లు అన్నట్లుగా తల ఆడిస్తుంది. ఆవు స్వతహాగానే తల ఆడించినా.. కారులోని వ్యక్తులు అడ్రస్ అడగ్గానే, అదే సమయంలో ఆవు కూడా తల తిప్పడంతో చూడటానికి అడ్రస్ చెబుతున్నట్లుగానే ఉంది. ఈ ఫన్నీ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా.. తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ‘‘ ఈ ఆవు ఉంటే.. గూగుల్ మ్యాప్స్ అవసరం లేదు’’.. అని కొందరు, ‘‘ ఈ ఆవు చాలా వైరైటీగా ఉందే’’.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

అక్కడంతే.. కొత్త అల్లుడిని పారిపోకుండా పట్టుకుని, గాడిద మీద ఊరేగిస్తారట.. చివరగా వారు చేసే పనేంటో తెలుసా..





Updated Date - 2022-03-17T02:44:10+05:30 IST