పిల్లలకు ఫన్నీ ఛాలెంజ్‌

ABN , First Publish Date - 2020-06-10T05:30:00+05:30 IST

తల్లితండ్రులు ఈ తీరిక సమయాన్ని పిల్లలతో సరికొత్తగా ఆస్వాదిస్తున్నారు. రకరకాల ఫన్నీ ఛాలెంజ్‌లతో వారు కూడా పసివాళ్లలా మారిపోతున్నారు. ప్రస్తుతం టిక్‌టాక్‌లో ‘పేషెన్స్‌ ఛాలెంజ్‌’ ట్రెండ్‌ అవుతోంది. ఇంతకీ ఈ ఛాలెంజ్‌ ఏమిటంటే...

పిల్లలకు ఫన్నీ ఛాలెంజ్‌

తల్లితండ్రులు ఈ తీరిక సమయాన్ని పిల్లలతో సరికొత్తగా ఆస్వాదిస్తున్నారు. రకరకాల ఫన్నీ ఛాలెంజ్‌లతో వారు కూడా పసివాళ్లలా మారిపోతున్నారు. ప్రస్తుతం టిక్‌టాక్‌లో ‘పేషెన్స్‌ ఛాలెంజ్‌’ ట్రెండ్‌ అవుతోంది. ఇంతకీ ఈ ఛాలెంజ్‌ ఏమిటంటే... పిల్లలకు ఇష్టమైన తినుబండరాలు వారి ముందు ఉంచి, వాటిని తినకుండా వాళ్లు ఎంతసేపు ఉండగలరో చూడడం. తల్లితండ్రులు తమ పిల్లలకు బాగా నచ్చిన స్నాక్‌, బిస్కెట్లు లేదా చాక్లెట్లను ఒక ప్లేటులో వేసి వారి ముందు పెడుతున్నారు. తాము తిరిగి వచ్చేంత వరకు వాటిని తినకుండా ఉండాలని వారికి చెప్పి పక్క గదికి వెళుతున్నారు.


పిల్లలు వాటిని తినకుండా ఉండేందుకు ఎంతలా ప్రయత్నిస్తారో రికార్డ్‌ చేసేందుకు ముందుగానే ఒక కెమెరా లేదా స్మార్ట్‌ఫోన్‌ను వారికి కనిపించకుండా ఏర్పాటుచేస్తారు. కళ్ల ముందు లొట్టలేయించే స్నాక్‌ ఉన్నప్పటికీ వాటిని తినకుండా ఎంత సమయం ఉంటారో తెలుసుకోవడమే ఈ ఫన్నీ ఛాలెంజ్‌ ఉద్దేశం. కొంతమంది తమ పెంపుడు కుక్కలతో కూడా ఈ సరదా ఛాలెంజ్‌ చేస్తూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ‘చాక్లెట్‌ ఛాలెంజ్‌, ప్రూట్‌ స్నాక్‌ ఛాలెంజ్‌’ అని కూడా పిలిచే ఈ ఛాలెంజ్‌ను ఎక్కువమంది ట్రై చేస్తున్నారు.


Updated Date - 2020-06-10T05:30:00+05:30 IST