Be Careful : హైదరాబాద్‌లోని ఈ ప్రముఖ bakery Sweetsలో ఫంగస్‌..!

ABN , First Publish Date - 2022-01-02T19:12:29+05:30 IST

హైదరాబాద్‌లోని ఈ ప్రముఖ bakery Sweetsలో ఫంగస్‌..!

Be Careful : హైదరాబాద్‌లోని ఈ ప్రముఖ bakery Sweetsలో ఫంగస్‌..!

  • తనిఖీ చేయాలని జీహెచ్‌ఎంసీకి అర్వింద్‌కుమార్‌ ఆదేశాలు

హైదరాబాద్‌ సిటీ : శేరిలింగంపల్లిలోని ఓ ప్రముఖ బేకరీలో కొనుగోలు చేసిన స్వీట్లలో ఫంగస్‌ ఉందని, జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే తినాలంటూ ఓ సామాజిక కార్యకర్త ఫొటోలతో సహా ట్వీట్‌ చేస్తూ మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌కు ట్యాగ్‌ చేశారు. తగు చర్యలు తీసుకోవాలంటూ ట్విటర్‌లో కోరారు. దాంతో స్పందించిన అర్వింద్‌కుమార్‌ తనిఖీలు చేయాలని జీహెచ్‌ఎంసీతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ డిజస్టార్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ను ఆదేశించారు. వెంటనే స్పందించిన జీహెచ్‌ఎంసీ అధికారులు సంబంధిత ఫుడ్‌సేఫ్టీ అధికారులను అప్రమత్తం చేశామని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కారం చేస్తామని ట్విటర్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2022-01-02T19:12:29+05:30 IST