రోషయ్యకు కన్నీటి వీడ్కోలు

ABN , First Publish Date - 2021-12-06T00:22:33+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు కన్నీటి వీడ్కోలు పలికారు. రోశయ్య అంత్యక్రియలకు వివిధ పార్టీల రాజకీయ నాయకులు

రోషయ్యకు కన్నీటి వీడ్కోలు

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు కన్నీటి వీడ్కోలు పలికారు. రోశయ్య అంత్యక్రియలకు వివిధ పార్టీల రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, వైశ్య కమ్యూనిటీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరై కన్నీటి పర్యంతమయ్యారు. తన వ్యవసాయ క్షేత్రమైన లిటిల్‌ ఇంగ్లాండ్‌లో పచ్చని చెట్ల మధ్య, పూల అలంకరణలో చితి స్థలంలో ఏర్పాటుచేసిన చిత్రపటానికి నివాళులర్పిస్తూ కన్నీటిని ఆపుకోలేకపోయారు. శాస్ర్తోక్తంగా నిర్వహించిన అంత్యక్రియలకు హాజరైన మహిళలు, కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీరు పెట్టుకున్నారు. అంత్యక్రియలకు అనారోగ్యంతో హాజరైన రోశయ్య సతీమణి లక్ష్మిశివపార్వతి ఆయన పార్థివ దేహం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు.


అంత్యక్రియలు జరిగింది ఇలా..

గాంధీభవన్‌ నుంచి రోశయ్య పార్థివ దేహం తన వ్యవసాయ క్షేత్రంలోకి గం.1.10 నిమిషాలకు చేరుకుంది.

చితి ప్రాంగణానికి గంటలు.1.20 నిమిషాలకు చేరుకుంది.

పార్థివ దేహానికి సుమారు రెండు గంటలపాటు శాస్త్రోక్తంగా శాంతి పూజలు నిర్వహించారు.

మధ్యాహ్నం 3.00 గంటలకు పూజల అనంతరం దహన సంస్కారానికి తీసుకువచ్చారు.

3.20 నిమిషాలకు అంత్యక్రియలకు వచ్చిన వారంతా రోశయ్య అమర్‌రహే అంటూ నినాదాలు చేసారు.

3.45 నిమిషాలకు రోశయ్య పెద్దకుమారుడైన శివసుబ్బారావు అంత్యక్రియల కార్యక్రమాలు ప్రారంభించారు.

3.47 నిమిషాలకు పోలీసులు వందన సమర్పణ చేసారు.

3.49 నిమిషాలకు పెద్దకుమారుడు చితికి నిప్పంటించారు.

Updated Date - 2021-12-06T00:22:33+05:30 IST