సైనికుడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

ABN , First Publish Date - 2022-01-10T05:22:48+05:30 IST

అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతిచెం దిన ఓ సైనికుడికి ఆదివారం కొత్తవలసలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

సైనికుడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
భౌతికకాయం వద్ద అధికారులు, పోలీసులు

కొత్తవలస: అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతిచెం దిన ఓ సైనికుడికి ఆదివారం కొత్తవలసలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. దేవాడ గ్రామానికి చెందినముద్దు నానాజీ(39) సైనికుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ తర్వాత మళ్లీ సర్వీసులోకి వెళ్లి డిఫెన్స్‌ సెక్యూరటీ సర్వీసులో శిక్షణ పొందుతుండగా అనారోగ్యానికి గుర య్యారు. దీంతో కలకత్తాలోని సైనిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేసినప్ప టికీ శనివారం మృతిచెందారు. నానాజీ దేవాడ గ్రామానికి చెందినప్పటికీ అత్తంటి వారు కొత్తవలసలోనే ఉంటున్నందున కొత్తవలసలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. మృతుడికి భార్య సంధ్యతో పాటు చార్లెస్‌ డార్విన్‌ అనే కుమారుడు, కుమార్తె ఊష్మా ఉన్నారు. నానాజీ మృతి చెందిన విషయాన్ని సైనికాధికారులు జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చారు. ఆదివారం నానాజీ భౌతిక కాయాన్ని తీసుకొచ్చి కొత్తవలస జడ్పీహైస్కూల్‌ పక్కన ఉన్న మైదానంలో కొద్దిసే పు ఉంచారు. అనంతరం శ్మశానవాటికకు తీసుకెళ్లి సైనిక లాంఛనాలతో అంత్యక్రి యలు నిర్వహించారు. సైనికులతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజయనగరం ఆర్డీవో భవానీశంకర్‌, తహసీల్దార్‌ ప్రసాద్‌, ఎస్‌ఐ హేమంత్‌ కుమార్‌, రెవెన్యూ, పోలీసు సిబ్బంది హాజరయ్యారు. 

 

 

Updated Date - 2022-01-10T05:22:48+05:30 IST