సిలిండర్‌తో శవయాత్ర

ABN , First Publish Date - 2022-05-29T05:10:38+05:30 IST

నిత్యం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను అదుపు చేయాలని కోరుతూ ఏఐవైఎఫ్‌ నాయకులు శనివారం సిలిండర్‌తో శవయాత్ర నిర్వహించారు.

సిలిండర్‌తో శవయాత్ర
కలెక్టరేట్‌ ఎదుట సిలిండర్‌తో శవయాత్ర నిర్వహిస్తున్న ఏఐవైఎఫ్‌ నాయకులు

కలెక్టరేట్‌ ఎదుట ఏఐవైఎఫ్‌ నిరసన

 కర్నూలు (కలెక్టరేట్‌), మే 28: నిత్యం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను అదుపు చేయాలని కోరుతూ ఏఐవైఎఫ్‌ నాయకులు శనివారం సిలిండర్‌తో శవయాత్ర  నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారంటూ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యాదర్శులు కొంగర శ్రీనివాసులు, కారుమంచి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అదాని, అంబానీలకు జాతీయ సంపదను దోచుపెడుతూ దేశ ప్రజలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో పెట్రోల్‌ ఽధర పెరిగితేనే అనేక ఆందోళనలు చేసిన బీజేపీ నేడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. రూ.450 ఉన్న వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర నేడు రూ.1150కు పెంచిం దని అన్నారు. నిత్యావసర వస్తువులైన వంటనూనె, ఉప్పు, పప్పు, చింత పండు ఇలా అన్ని రేట్లు పెంచి పేద ప్రజలకు ఆహారాన్ని అం దని ద్రాక్షగా చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ దేశంలో ఎక్కడా లేని విధంగా చెత్త పన్ను వేయడమే కాకుం డా నూతన ఆస్తి పన్ను పెంచిందని ఽధ్వజమెత్తారు. విద్యుత, బస్‌ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతోందని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు తగ్గించాలని వారు డిమాండ్‌ చేశా రు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు చంద్రశేఖర్‌, శ్రీరాములు, రాజీవ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సమితి సభ్యులు ఉపేంద్ర, చంటి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి సోమన్న, ఉపాధ్యక్షులు రంగస్వామి, నగర నాయకులు మునిస్వామి, ఏఐవైఎఫ్‌ నగర అధ్యక్షులు బాబయ్య, చిన్న, పవన తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-05-29T05:10:38+05:30 IST