చిత్తశుద్ధి వుంటే నిధులను జమచేయాలి

ABN , First Publish Date - 2021-12-01T05:38:19+05:30 IST

ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే గ్రామ పంచాయతీ నిధులను తక్షణమే జమచేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరాయచౌదరి డిమాండ్‌ చేశారు.

చిత్తశుద్ధి వుంటే నిధులను జమచేయాలి
మాట్లాడుతున్న ఉన్నం హనుమంతరాయచౌదరి

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరాయచౌదరి 

కళ్యాణదుర్గం, నవంబరు30: ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే గ్రామ పంచాయతీ నిధులను తక్షణమే జమచేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరాయచౌదరి డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక ఉన్నం చారిటబుల్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో విలేరులతో మాట్లాడారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.1309కోట్లను తక్షణమే పంచాయతీ ఖాతాలో జమచేయాలన్నారు. తీవ్ర వర్షాభావంతో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, శానిటేషన, వీధిదీపాలు తదితర వాటితో  రెండున్నర సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందులకు గురవతున్నారన్నారు. ఇలాంటి తరుణంలో పంచాయతీ నిధులను సీఎం జగనరెడ్డి వాటిని మళ్లించడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామాభివృద్ధికి పాటుపడాలని హితువు పలికారు. సమావేశంలో ఆవుల తిప్పేస్వామి, గాజుల శ్రీరాములు, గోవిందరెడ్డి, విశ్వేశ్వరప్రసాద్‌, రామ్మూర్తినాయుడు, ప్రసాద్‌, డీకే రాజన్న, గోళ్ల రాము, గడ్డం రామాంజినేయులు, పాలబండ్ల రామన్న, పోతుల రాజు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-01T05:38:19+05:30 IST