Advertisement
Advertisement
Abn logo
Advertisement

48 గ్రామాల్లో కుళాయిల ఏర్పాటుకు నిధులు మంజూరు


నాతవరం, నవంబరు 26 : మండలంలోని 48 గ్రామాల్లో పైప్‌లైన్‌లు, కుళా యిల ఏర్పాటుకు రూ.10.35 కోట్లు మం జూరైనట్టు ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ పి.ప్రభా కర్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో జల్‌ జీవన్‌ మిషన్‌పై సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు ఏర్పాటైన అవగాహన సదస్సులో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఆరోగ్యకరమైన నీటి నిర్వహణ నెలకొల్పేందుకు, రోజు ఒక వ్యక్తికి 55 లీటర్ల నీరు అందించేందుకు ఈ మిషన్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 2024 నాటికి ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యంగా పేర్కొన్నారు.  ఏఈ రాజేష్‌, జల్‌ జీవన్‌ మిషన్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ పుల్లయ్య, ఎంపీడీవో యాదగిరేశ్వరరావు, సెం ట్రల్‌ బ్యాంకు డైరెక్టర్‌ అంకంరెడ్డి జమీలు, జడ్పీ టీసీ కె.అప్పలనర్స వైస్‌ ఎంపీపీ పైల సునీల్‌, పైల పోతురాజు, వైసీపీ మండల అధ్యక్షుడు శెట్టి నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement