Abn logo
May 14 2021 @ 01:06AM

గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలి

గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలి

ముండ్లమూరు, మే 13: మండలంలోని పెద్దఉల్లగల్లుకు పార్లమెంట్‌ నిధులు కేటాయించి గ్రామాభివృద్ధికి సహకరించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని గురువారం పెద్దఉల్లగల్లు సర్పంచ్‌ పిచ్చయ్య ఆధ్వర్యంలో నాయకులు కలిశారు. ముందుగా మాగుంటను ఘనంగా గజమాల, శాలువాలతో సన్మానించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గ్రామాల్లోని వీధుల్లో సిమెంట్‌ రోడ్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పంధించిన ఎంపీ త్వరలో నిధులు కేటాయిస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జనమాల నాగేంద్రంపిచ్చయ్య, వాతల రామిరెడ్డి, మాజీ సర్పంచ్‌ జె.ప్రసాదు, తూము రాఘవరెడ్డి, సిద్దమూర్తి నర్శింహరెడ్డి, జె.చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement