రామ మందిర నిర్మాణానికి నిధుల సేకరణ

ABN , First Publish Date - 2021-01-16T05:33:12+05:30 IST

అయోధ్యలో నిర్మించనున్న రామాలయ నిర్మాణానికి శుక్రవారం మండలంలో విరాళాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా బూరవిల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ప్రధానార్చకులు ఆరవెల్లి సీతారామస్వామి నిధి సేకరణ, ప్రచార వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. బూరవిల్లి, అంబళ్లవలస, జోగిపంతులపేట తదితర గ్రామాల్లో తొలి రోజు వి రాళాలు సేకరించారు.

రామ మందిర నిర్మాణానికి నిధుల సేకరణ
బూరవిల్లిలో జెండా ఊపి ప్రారంభిస్తున్న పెద్దలు

బూరవిల్లి(గార): అయోధ్యలో నిర్మించనున్న రామాలయ నిర్మాణానికి శుక్రవారం మండలంలో విరాళాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా బూరవిల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ప్రధానార్చకులు ఆరవెల్లి సీతారామస్వామి నిధి సేకరణ, ప్రచార వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. బూరవిల్లి, అంబళ్లవలస, జోగిపంతులపేట తదితర గ్రామాల్లో తొలి రోజు వి రాళాలు సేకరించారు. జిల్లా ప్రముఖులు డి.వి.రమణమూర్తి, మండల ప్రముఖులు పాపారావు, సభ్యులు, ఇతర పెద్దలు పాల్గొన్నారు. 


గుజరాతీ పేట: అయోధ్య రామాలయ నిర్మాణంలో 11 కోట్ల మంది హిందువులు భాగ స్వామ్యం కావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలం కోరారు. శుక్రవారం పీఎన్‌కాలనీ నారాయణ తిరుమల ఆలయంలో గురుగుబిల్లి శ్రీని వాసరావు స్వామి నుంచి విరాళ సేకరణను ప్రారంభించారు. వి.సు బ్రహ్మణ్యం, ఎంఎల్‌ఎం దయా సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.   



 హిర మండలం: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి గాను హిరమండలంలో విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) సభ్యులు శుక్రవారం అభియాన్‌ నిధి సేకరణ  కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామమందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సాయమందించాలని కోరారు. సమరసత సేవా ఫౌండేషన్‌ ద్వారా విరాళాలు సేకరి స్తున్నట్లు సభ్యులు బి.ధర్మారావు చెప్పారు. 


 బంటుపల్లి (రణస్థలం): అయోధ్య ఆలయ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని సాధు పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసా నంద, బీజేపీ నాయకుడు నడికు దిటి ఈశ్వరరావు  కోరారు. శుక్రవారం బంటుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అయోధ్య ఆలయ నిర్మాణానికి ఎన్‌ఈఆర్‌ రూ.1,11,016, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మహంతి సత్యనారాయణ రూ.1,00001లను స్వామి శ్రీనివాసానంద చేతులమీదుగా అందజేశారు. 

Updated Date - 2021-01-16T05:33:12+05:30 IST