Abn logo
Sep 25 2021 @ 00:44AM

నిధుల మంజూరు మంత్రి కేటీఆర్‌ హామీ

మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ 

జగిత్యాల, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): జగిత్యాల నియోగజకవర్గంలో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ కలిశారు. హైదరాబాద్‌లో మంత్రి కేటీ ఆర్‌ను కలిసి జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల, రాయికల్‌ పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరు తూ వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే వినతిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌ టీయూఎఫ్‌ఐడీసీ కింద నిధులను విడుదల చేసేందుకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ హామీ పట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు.