విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమానికి నిధులు

ABN , First Publish Date - 2021-05-10T04:16:58+05:30 IST

కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక ప రిస్థితి దిగజారినా సంక్షేమ పథకాలకు నిధులు మం జూరు చేస్తున్న ఘనత దేశంలో సీఎం చంద్రశేఖర్‌ రావుకే దక్కుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటే శ్వర్‌రెడ్డి అన్నారు.

విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమానికి నిధులు
చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

- దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి  

కొత్తకోట, మే 9: కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక ప రిస్థితి దిగజారినా సంక్షేమ పథకాలకు నిధులు మం జూరు చేస్తున్న ఘనత దేశంలో సీఎం చంద్రశేఖర్‌ రావుకే దక్కుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటే శ్వర్‌రెడ్డి అన్నారు. కొత్తకోట మునిసిపల్‌ కార్యాలయం లో ఆదివారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను 79మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులకు, వితంతువు లకు, దివ్యాంగులకు పింఛన్లు నెల మొ దటి వారంలోగా పంపిణీ పూర్తి చేస్తున్నామన్నారు. ఉద్యమకారుడు సీఎం ఉండడంతోనే కరోనా కాలంలో ఎన్ని కష్టాలు ఎదురైన మొక్కవోని దీక్షతో ప్రజల అభి వృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతిని నిరోధించడానికి ప్రతీ ఒక్కరు టీకా తీ సుకోవాలని అవసరం ఉండి బయటకు వచ్చినప్పుడు మాస్క్‌ ధరించాలని కోరారు. అంతకు ముందు ప ట్టణంలోని పేద ముస్లింలకు దుస్తులు అందించారు. అనంతరం ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు అందుకున్న ప్రేమయ్యను శాలువాతో ఘనంగా సన్మా నించారు. ఈ కార్యక్రమానికి మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ సుకేశిని అధ్యక్షత వహించారు.  జిల్లా పరిషత్‌ వైస్‌ చై ర్మన్‌ వామన్‌గౌడ్‌, ఎంపీపీ గుంత మౌనిక, వైస్‌ చైర్‌పర్సన్‌ జయమ్మ, సీడీసీ చైర్మన్‌ చెన్నకేశవరెడ్డి, కౌ న్సిలర్లు కొండారెడ్డి, రాములు యాదవ్‌, మహేశ్వరి, తి రుపతి, రాంమోహన్‌రెడ్డి, పద్మ, ఖాజామైనుద్దీన్‌, కటిక శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-10T04:16:58+05:30 IST